Barrelakka | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క 983 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లు కేవలం మూడు రౌండ్లవి మాత్రమే. మొత్తం రౌండ్లు పూర్తయ్యేసరికి బర్రెలలకు 5 వేల ఓట్లు దాటే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున బీరం హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ తరపున జూపల్లి కృష్ణారావు పోటీలో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది.