NRI | నకిలీ చెక్కులు.. ఫోర్జరీ సంతకాలు.. ఎన్నారైని నిండా ముంచిన బ్యాంకు అధికారులు
నకిలీ చెక్కులు, ఫోర్జరీ సంతకాలతో ఓ ఎన్నారైని బ్యాంకు అధికారులు నిండా ముంచేశారు. ఖాతాదారుడికి తెలియకుండానే రూ.6.5కోట్లు కొట్టేశారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై కోర్టు ఆదేశాలతో కేసు నమోదైంది.
NRI | ఖైరతాబాద్, డిసెంబర్ 9 : నకిలీ చెక్కులు, ఫోర్జరీ సంతకాలతో ఓ ఎన్నారైని బ్యాంకు అధికారులు నిండా ముంచేశారు. ఖాతాదారుడికి తెలియకుండానే రూ.6.5కోట్లు కొట్టేశారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై కోర్టు ఆదేశాలతో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆస్ట్రేలియా న్యూసౌత్ వేల్స్, సిడ్నీ క్వాకర్స్ హిల్, లవర్ గ్రోవ్‌డ్రైవ్‌లో నివాసముండే పరితోష్ ఉపాధ్యాయ్‌కు యాక్సిస్ బ్యాంక్ బేగంపేట బ్రాంచ్‌లో 2017 నుంచి ఖాతా ఉన్నది.
బ్యాంకు సీనియర్ పార్టనర్ వెంకటరమణ, ఉద్యోగులు సురేఖ, హరి విజయ్, శ్రీదేవి, రఘుతో కలిసి ఆయన ఖాతాలోని డబ్బులను కాజేసేందుకు పథకం రచించారు. నకిలీ చెక్కులు తయారు చేసి, దానిపై సంతకాలు ఫోర్జరీ చేసి ఖాతాదారుడికి తెలియకుండానే రూ.6.5కోట్లు డ్రా చేసుకున్నారు.
అక్టోబర్ 21న యాక్సిస్ బ్యాంకులోని ఖాతాను మూసివేసినట్టుగా మెయిల్ రావడంతో పరితోష్ కంగుతిన్నాడు. విచారించగా 42 నకిలీ చెక్కులతో డబ్బులు దోచుకున్నట్టు గుర్తించాడు. ఈ విషయంపై బ్యాంకు సీఈవోను సంప్రదించగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఎఫ్ఐఆర్ నమోదు, కోర్టు రిఫర్ కేసు అయినా నెల రోజుల వరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

