డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి రుడాల్ఫ్ వీ షిండ్లెర్ అవార్డు

హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ)/ కొండాపూర్: హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖాన చైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ డీ నాగేశ్వర్‌రెడ్డికి ప్రతిష్ఠాత్మక రుడాల్ఫ్ వీ షిండ్లెర్ అవార్డు లభించింది. ఎండోస్కోపీరంగంలో చేసిన పరిశోధనలు, బోధనలు, సేవలకుగాను ఆయనకు ఈ అవార్డును ప్రకటించారు. ‘ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రోస్కోపీ’గా పేరొందిన డాక్టర్ రుడాల్ఫ్ వీ షిండ్లెర్ జ్ఞాపకార్థం అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎండోస్కోపి (ఏఎస్డీఈ) ప్రతి ఏటా ఈ అవార్డును ప్రకటిస్తుంది. ఈ అవార్డు దక్కించుకొన్న తొలి భారతీయుడు.. డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి. ఆదివారం రాత్రి వర్చువల్ విధానంలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఏఎస్డీఈ అధ్యక్షుడు డాక్టర్ క్లాస్ మెర్గనర్ మాట్లాడుతూ.. ఎండోస్కోపి రంగంలో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి చేసిన సేవలు అమూల్యమైనవని ప్రశంసించారు. తనకు ఈ అవార్డు దక్కడం సంతోషంగా ఉన్నదని, తన బాధ్యతను మరింత పెంచిందని నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎండోస్కోపీలో మరిన్ని పరిశోధనలు, మెరుగైన వైద్యసేవలు, విద్యా బోధన అందించేందుకు కృషి చేస్తామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

