యూడైస్‌లో పేరుంటేనే ఇంటర్ పరీక్షలకు!
ఇంటర్ వార్షిక పరీక్షలు రాయబోతున్నారా..? పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉందా..? అయితే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్(యూడైస్)లో మీ పేరు ఉండాల్సిందే.
- పది, ఇంటర్ పరీక్షలకు తప్పనిసరి
- ఇప్పటి వరకు 75శాతమే నమోదు
- అపార్ నమోదు కూడా 64శాతమే..
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షలు రాయబోతున్నారా..? పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉందా..? అయితే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్(యూడైస్)లో మీ పేరు ఉండాల్సిందే. యూడైస్‌లో పేరు లేకపోతే పరీక్షలు రాసేందుకు అనుమతించరు. అసలు ఎగ్జామ్ ఫీజు కట్టేందుకే వీలుండదు. ఇంటర్లో యూడైస్ నమోదును అధికారులు తప్పనిసరిచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9లక్షలకుపైగా విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు.
ఇప్పటి వరకు 75% విద్యార్థుల పేర్లు మాత్రమే యూడైస్‌లో నమోదయ్యాయి. మరో 25% నమోదు పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రిన్సిపాళ్లను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. మిగతా విద్యార్థుల పేర్లను యూడైస్‌లో నమోదు పూర్తిచేయాలని ఆదేశాలిచ్చారు. పాఠశాల విద్యలో పదో తరగతిని ఇప్పటికే యూడైస్‌తో అనుసంధానించారు.
కొత్తగా ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌లోనూ యూడైస్ ఎంట్రీ ప్రారంభించారు. ఆధార్‌లో తప్పులుండటం, వాటిని సవరించాల్సి ఉండటంతో మిగతా వాళ్ల నమోదులో సమస్య తలెత్తుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో అపార్ నమోదు అంత ఆశాజనకంగా లేదు. మొత్తం విద్యార్థుల్లో ఇప్పటి వరకు 64% మాత్రమే అపార్‌లో నమోదుచేస్తున్నారు. మరో 36% విద్యార్థులు మాత్రమే పెన్ నంబర్ పొందారు. ఆధార్ ఆధారంగా యూడైస్‌లో నమోదుచేస్తారు. ఈ యూడైస్ ఆధారంగా అపార్ ఎంట్రీ ఉంటుంది. పెన్ నంబర్ కేటాయిస్తున్నారు. ఇటీవలీ కేంద్ర విద్యాశాఖ అపార్ నమోదును పూర్తిచేయాలని అధికారులను ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

