Newborn baby | దారుణం..ముళ్ల పొదల్లో నవజాత శిశువు.. సకాలంలో స్పందించి కాపాడిన అంబులెన్స్ సిబ్బంది
Newborn baby | జిల్లాలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన నవజాత ఆడ శిశువును తల్లిదండ్రులు ముళ్ల పొదల్లో పడేసి మానవత్వాన్ని మంటగలిపారు.
నారాయణపేట జిల్లా : జిల్లాలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన నవజాత ఆడ శిశువును ( Newborn baby ) తల్లిదండ్రులు ముళ్ల పొదల్లో పడేసి మానవత్వాన్ని మంటగలిపారు. అటుగా వెళ్తున్న స్థానికులు శిశువు ఏడుపు విని 108 అంబులెన్స్‌కు ( Ambulance ) సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది పరీక్షించి వైద్యం అందించి రక్షించి బాధ్యతను నెరవేర్చారు.
నారాయణపేట ( Narayanapeta) మండలం అప్పక్ పల్లి గ్రామం కాటన్ మిల్ సమీపంలో ముళ్లపొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఆడశిశువును వదిలేసి వెళ్లారు. స్థానికులు చిన్నారి ఏడుపులు విని అంబులెన్స్‌కు సమాచారం అందజేయడంతో హుటాహుటిన వారు అక్కడికి చేరుకొని, ఆ నవజాత శిశువును కాపాడారు.
స్వల్ప గాయాలతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న శిశువును గమనించిన అంబులెన్స్ టెక్నీషియన్స్ శిరీష ప్రథమ చికిత్స చేసి నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం జిల్లా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మహేందర్ శిశువును పరీక్షించి, ప్రస్తుతం శిశువు ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వెల్లడించారు. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన 108 సిబ్బంది, టెక్నీషియన్ శిరీష, పైలెట్ రాములును అంబులెన్ష్ సూపర్వైజర్ రాఘవేంద్ర అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

