లాస్య నందితకు అసెంబ్లీ నివాళి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై శాసనసభ మంగళవారం సంతాపం ప్రకటించింది. సభ్యులందరూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
- సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్
- లాస్య కుటుంబానికి అండగా ఉంటాం: కేటీఆర్
- సభ రేపటికి వాయిదా
- 31 వరకే అసెంబ్లీ సెషన్
- 25న రాష్ట్ర బడ్జెట్.. నాలుగు రోజులు చర్చ
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై శాసనసభ మంగళవారం సంతాపం ప్రకటించింది. సభ్యులందరూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. సభ ప్రారంభమయ్యాక ముందుగా సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెట్టడానికి చింతిస్తున్నానని తెలిపారు. లాస్య మృతికి సభ తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నదని, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నదని చెప్పారు. లాస్య తండ్రి సాయన్నతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. లాస్య, సాయన్న ఆశయాలు నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు.
సాయన్న కుటుంబానికి అండగా ఉంటాం: కేటీఆర్
కేసీఆర్ నాయకత్వంలో కంటోన్మెంట్ అభివృద్ధికి సాయన్న కృషి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ గుర్తు చేశారు. సాయన్న మరణానంతరం ఆ స్థానంలో కుమార్తె లాస్యనందిత గెలిచారని, ఆమె కూడా మృతి చెందడం బాధాకరమని భావోద్వేగానికి లోనయ్యారు. సాయన్న కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
లాస్య నందిత మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, వివేకానంద్‌గౌడ్, సునీతా లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, ముఠా గోపాల్ పేర్కొన్నారు. యువ ఎమ్మెల్యే లాస్య మరణం కంటోన్మెంట్ ప్రజానీకానికి తీరని లోటని మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ అన్నారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య మన మధ్య లేకపోవడం బాధాకరమని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. లాస్య మరణం విచారకరమని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

