భర్తపై ‘మొక్క’వోని ప్రేమ! ఆరేండ్ల క్రితం దూరమైన భర్త జ్ఞాపకాలను మొక్కలో చూసుకుంటూ బర్త్‌డే వేడుక
వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి భర్త కోట్రిక వెంకటయ్య భౌతికంగా దూరమైనా ఆయనపై ‘మొక్క’వోని ప్రేమ చాటుతున్నారు. 2016 జూలై 29న వెంకటయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో కలిసి తాండూరు పట్టణంలోని తాము నివసిస్తున్న ఇంటి ముందు ఆమె ఓ మొక్క నాటారు.
- మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రికా విజయలక్ష్మిని
- అభినందించిన ఎంపీ సంతోష్‌కుమార్
- బాధను పది మంది బాగుగా మార్చడం ఆదర్శం
- సేవకు ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ అండగా ఉంటుందని ప్రకటన
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి భర్త కోట్రిక వెంకటయ్య భౌతికంగా దూరమైనా ఆయనపై ‘మొక్క’వోని ప్రేమ చాటుతున్నారు. 2016 జూలై 29న వెంకటయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో కలిసి తాండూరు పట్టణంలోని తాము నివసిస్తున్న ఇంటి ముందు ఆమె ఓ మొక్క నాటారు. వెంకటయ్య అనారోగ్యం పాలై 2017 ఏప్రిల్ 5న మరణించారు. తన భర్త బర్త్‌డే సందర్భంగా నాటిన మొక్కకు ఏటా కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుక ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆరు నెలల క్రితం రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో చెట్టును జేసీబీ సహాయంతో వేర్ల నుంచి పెకిలింపజేశారు. దాన్ని తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నాటారు. ఈసారి ఆ చెట్టుకే జన్మదిన వేడుకలు నిర్వహించి అన్నదానం చేశారు. విషయం తెలుసుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ఆమెతో ఆదివారం ఫోన్లో మాట్లాడి అభినందించారు.
ఈ సందర్భాన్ని ట్విట్టర్లోనూ పంచుకున్నారు. ప్రతి మనిషి జీవితంలో బంధం, అనుబంధం, వాటి జ్ఞాపకాలు మనుషుల్ని నడిపిస్తుంటాయని, అయితే అందరూ తమకు ఇష్టమైన వ్యక్తుల జ్ఞాపకాల్ని గుండెల్లో దాచుకుంటే.. కొందరు వాటికి రూపం ఇచ్చి ఆరాధిస్తుంటారని ఎంపీ సంతోష్ తెలిపారు. జీవితం ఉన్నంత వరకూ ఇష్టపడ్డ వ్యక్తుల జ్ఞాపకాలు ఉంటాయని, వారు గుర్తొచ్చిన ప్రతిక్షణం ఆ జ్ఞాపకాలు మన హృదయాన్ని కదిలిస్తుంటాయని చెప్పారు. అయితే, జ్ఞాపకాలను ప్రకృతితో మమేకం చేయాలనే ఆలోచన అద్భుతమని పేర్కొన్నారు. భర్త జ్ఞాపకాలను ఒక గుర్తుగానే మిగిలిపోనీయకుండా సమాజం బాగు కోసం ఆలోచించడం అరుదైన విషయమని విజయలక్ష్మిని అభినందించారు. ‘పది మంది బాగు కోసం బాధను కూడా పండుగలా మార్చడం, మొకను నాటి పెద్ద చేయటం.. మీ మానవత్వం సమాజంలోని మరింత మందికి ఆదర్శం’ అని ప్రశంసించారు. ‘మీరు చేసే ప్రకృతి సేవకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సదా అండగా ఉంటుందని సంతోష్ హామీ ఇచ్చారు. మానవ మనుగడకు అవసరమైన వృక్షాలను ప్రతి ఒక్కరూ నాటి సంరక్షించాలని కోరారు.
Heartwarming scenes. #KotrikaVijayaLaxmi garu, a strong, determined lady searching for her lost husband amidst the tree he planted on his birthday as part of the #GreenIndiaChallenge initiative. Every year on his birthday, the family celebrates at this tree, showing their… pic.twitter.com/uLccrPcmx8
— Santosh Kumar J (@SantoshKumarBRS) July 30, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | దీక్షా దివస్.. అమరవీరుల స్థూపానికి హరీశ్ రావు నివాళులు.. వీడియో
Yadagirigutta | యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Siddharth Galla | కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేశ్ బాబు మేనల్లుడు.. వైరల్ అవుతున్న సిద్ధార్థ్ గల్లా వెడ్డింగ్ ఫొటోలు!
Niharika Konidela | కుందనపు బొమ్మలా మెరిసిన మెగా డాటర్.. నిహారిక ఫొటోలు వైరల్
MK Stalin | రాహుల్ గాంధీ ట్వీట్‌కు ధీటైన సమాధానమిచ్చిన తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

