ఆవిష్కర్తలకు ఆహ్వానం
- ‘ఇంటింటా ఇన్నోవేటర్’కు దరఖాస్తులు
- ఆగస్టు 5 వరకు అప్లికేషన్లకు అవకాశం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): గృహిణి అయినా, వ్యవసాయదారుడైనా, కాలేజీ లెక్చరర్లు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, విద్యార్థులు.. ఇలా ఎవరైనా సరే తమలోని ఆవిష్కర్తను ప్రపంచానికి పరిచయం చేయొచ్చు. మీలో నూతన ఆవిష్కరణలను వెలికి తీసేందుకు తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) అవకాశం కల్పిస్తున్నది. అందుకోసం ‘ఇంటింటా ఇన్నోవేటర్’ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా సైన్స్ అధికారి ధర్మేందర్రావు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. టీఎస్ఐసీ ఆధ్వర్యంలో అన్ని రంగాలకు చెందిన ప్రజల నుంచి వాట్సాప్ ద్వారా దరఖాస్తులు కోరతున్నామని ఆయన వెల్లడించారు.
దీనివల్ల ఆవిష్కర్తలు చేసిన పరికరాలను భవిష్యత్తులో పేటెంట్ హాక్కులతో పాటు మార్కెటింగ్ చేసి ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుందని వివరించారు. ఆవిష్కర్త పేరు, వయసు, వృత్తి, గ్రామం, జిల్లా పేరు, ఆవిష్కరణకు సంబంధించిన నాలుగు చిత్రాలు, 6 వాక్యాల వివరణ, రెండు నిమిషాల వీడియో వంటివి 9100678543 నంబర్‌కు వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు. ఇందుకు ఆగస్టు 5 వరకు గడువు విధించామని తెలిపారు. ఎంపికైన ఆవిష్కరణలను స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శిస్తామని వెల్లడించారు. సర్టిఫికెట్తో పాటు ఉత్తమ ఆవిష్కరణలకు సాంకేతిక సహకారం అందిస్తామని పేర్కొన్నారు. సందేహాలకు జిల్లా సైన్స్ అధికారిని సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

