Jyothakka | నేను బీఆర్ఎస్కు ఎందుకు సపోర్ట్ చేయకూడదు..? యాంకర్ శివజ్యోతి నెటిజన్లకు సూటి ప్రశ్న
Jyothakka | పైసల కోసమో, పదవుల కోసమో నేను రాజకీయాల వైపు వెళ్లలేదు. పైసలు సంపాదించుకోగలుగుతాను. అది వేరే విషయం. నేను ఈ రోజు స్థాయిలో ఉన్నాను అంటే.. ఒక మూడు నాలుగు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది తెలంగాణ రావడం.
Jyothakka | తెలంగాణ శాసనసభకు మూడోసారి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా చాలా మంది ప్రముఖులు, ఇతరులు ఆయా పార్టీలకు మద్దతు ప్రకటించి, ప్రచారంలో పాల్గొన్నారు. ఆ మాదిరిగానే యాంకర్ శివజ్యోతి అలియాస్ జ్యోతక్క కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోషల్ మీడియాలో ఆమె అనేక వీడియోలు చేసి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపింది. అయితే జ్యోతక్క ప్రచారాన్ని ప్రతిపక్షాలతో పాటు పలువురు నెటిజన్లు తప్పుబట్టారు. లేనిపోని ఆరోపణలు చేయడం, ఎంతకు అమ్ముడుపోయావు.. బీఆర్ఎస్కు ఎందుకు మద్దతు ఇస్తున్నావు అని కామెంట్లు చేస్తున్న వారికి జ్యోతక్క ఘాటుగా సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియాలో ఆమె ఒక వీడియో విడుదల చేశారు.
పైసల కోసమో, పదవుల కోసమో నేను రాజకీయాల వైపు వెళ్లలేదు. పైసలు సంపాదించుకోగలుగుతాను. అది వేరే విషయం. నేను ఈ రోజు స్థాయిలో ఉన్నాను అంటే.. ఒక మూడు నాలుగు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది తెలంగాణ రావడం. కొన్ని వందల మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేస్తే, కేసీఆర్ కొట్లాడి చావు నోట్లో తలకాయ పెట్టి, ఆల్మోస్ట్ చావు దాకా పోయొచ్చిన తర్వాత తెలంగాణ వచ్చింది. నేను బీఆర్ఎస్కు ఎందుకు సపోర్ట్ చేయొద్దన్ని అడుగుతున్నా. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అన్ని చానెల్స్ నన్ను రిజెక్ట్ చేశాయి. ఒక చానెల్ తప్ప. చాలా అవమానాలు ఎదుర్కొన్నా.. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత రిజెక్ట్ చేసిన చానెల్స్ మళ్లీ నాకు అవకాశం వచ్చాయి. తెలంగాణ రాకపోతే ఇది సాధ్యమయ్యేనా..? నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న అంటే.. నాకు కేసీఆర్ సర్, కేటీఆర్ అన్న.. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినోళ్లు ఈమె మా పిల్ల మీ ఛానెల్స్‌లో పెట్టుకోమని ఎవరూ చెప్పలేదు. తెలంగాణ మొత్తానికి అవకాశం, గౌరవం ఇచ్చారు. అందులో నేను ఒకదాన్ని. ఆ ప్రేమ ఉంది తప్పితే మరొకటి లేదు. అందుకోసమే నేను బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా అని జ్యోతక్క వివరణ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

