బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధికి జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు.
- 28న ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ సమావేశం
చిక్కడపల్లి, నవంబర్13: బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధికి జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ నెల 28వ తేదీన బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆల్ ఇండియా బ్రాహ్మణ పెడరేషన్ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఇన్చార్జి నైషధం సత్యనారాయణమూర్తి, జాతీయ ముఖ్య సలహాదారు పెద్దిబొట్ల లక్ష్మీనారాయణ, ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ ద్రోణంరాజు రవికుమార్ మాట్లాడారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణుల సమస్యలు, పేద బ్రాహ్మణుల సంక్షేమం, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలు, సంఘటితంగా ముందుకు సాగాల్సిన అంశాలపై చర్చిస్తామని వెల్లడించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 150 మంది ప్రతినిధులు సమావేశానికి హాజరవుతారని తెలిపారు. సమావేశంలో నాయకులు వారణాసి వంశీ, శ్రీనివాస్, వైష్ణవీప్రసాద్, తులసీశ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు సూర్యకాంతం, జయతులసి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

