Agnishikha | దివ్య ఔషధం అగ్నిశిఖ.. నల్లమలలో విరివిగా లభిస్తున్న తీగజాతి మొక్క
ఆయుర్వేద వైద్యంలో అడవి నాభిగా ప్రసిద్ధి చెందిన అగ్నిశిఖ మొక్కలు నల్లమలలోని పులిచెరువు, తుమ్మలబైలు తదితర ప్రాంతాల్లో విరివిగా పెరుగుతున్నాయి.
- ఆయుర్వేదంలో వినియోగం
- అడవి నాభిగా ప్రసిద్ధి చెందిన తీగజాతి మొక్క
- నల్లమలలో విరివిగా లభ్యం
Agnishikha | హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : ఆయుర్వేద వైద్యంలో అడవి నాభిగా ప్రసిద్ధి చెందిన అగ్నిశిఖ మొక్కలు నల్లమలలోని పులిచెరువు, తుమ్మలబైలు తదితర ప్రాంతాల్లో విరివిగా పెరుగుతున్నాయి. దీనిని ఇంగ్లిష్‌లో ఫ్లేమ్లిల్లీ, ఫైర్లిల్లీ, గ్లోరియసాలిల్లీ అని, వాడుక భాషలో నాగేటిగడ్డ, నీరుపిప్పిలి అని పిలుస్తుంటారు. వీటి పుష్పాలు ఎరుపు, నారింజ, తెలుపు, పసుపు రంగుల కలబోతగా దర్శనమిస్తాయి. ఆయుర్వేదంలో దీనిని దివ్య ఔషధంగా భావిస్తారు. దీని కాండం, ఆకులు, విత్తనాలు, పండ్లు, పూలు, దుంపలు అన్నీ విషపూరితమైనవే.
ఇందులో ‘కోల్చీసిన్’ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీనిని పాము, తేలుకాటుకు విరుగుడుగా, చర్మవ్యాధులు, కిడ్నీ సమస్య, గాయాలకు మందుగా వాడుతారు. దీర్ఘకాలిక రోగాలతోపాటు కుష్టుతో కలిగే గాయాలు, కడుపు నొప్పి నివారణకు వినియోగిస్తారు. ఆత్మన్యూనత వంటి మానసిక రోగాలతోపాటు రక్తపోటు నివారణకు చక్కగా పని చేస్తుందని, గర్భధారణ అవకాశాలను మెరుగుపర్చుతుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

