పరిహారం చెల్లించకుండా పనులెలా చేపడతారు? ఓపెన్ కెనాల్ పనులను అడ్డుకున్న బాధిత రైతులు
దంతంపల్లి శివారులో రాఘవ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఓపెన్ కెనాల్ నిర్మాణ పనులను బాధిత రైతులు అడ్డుకున్నారు.
ఊట్కూర్, నవంబర్ 03 :మక్తల్- నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని దంతంపల్లి శివారులో రాఘవ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఓపెన్ కెనాల్ నిర్మాణ పనులను బాధిత రైతులు అడ్డుకున్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండానే పనులు ఎలా చేపడతారని అధికారులను నిలదీశారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు పనుల ప్రదేశానికి చేరుకుని ఆందోళనకు దిగారు.
ఊట్కూరు పెద్ద చెరువును రిజర్వాయర్‌గా మారిస్తే గ్రామానికి ముంపు ప్రమాదం పొంచి ఉందని, ఈ నేపథ్యంలో ఊట్కూరు గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని రైతులు డిమాండ్ చేశారు.
భూములు కోల్పోతున్న రైతులకు పరిహారంతో పాటు పొలాల్లోని చెట్లు, సాగునీటి పైపులైన్లు, బోరుబావులు, కంచెలకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. రైతులు, బీఆర్ఎస్ నాయకుల ఆందోళనతో దాదాపు రెండు గంటలకు పైగా పనులు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న తహసీల్దార్ అశోక్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
Jobs | అటామిక్ ఎనర్జీలో 254 టీచర్ పోస్టులు.. నవంబర్ 22 చివరితేదీ
Tusshar Kapoor | రూ.5 కోట్లు ఇవ్వకుంటే లేపేస్తాం.. మరో బాలీవుడ్ నటుడికి బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు..!
Abdulla Shahid: చిన్నారిపై లైంగిక వేధింపులు.. మాల్దీవులు మాజీ విదేశాంగ మంత్రి అరెస్టు
AP News | తూర్పుగోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థుల హవా.. మూడు వార్డుల్లోనే వైసీపీ ఆధిక్యం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

