AEE Aspirants | నియామక పత్రాలు ఇవ్వండి.. గాంధీభవన్‌ను ముట్టడించిన ఏఈఈ అభ్యర్థులు
డాక్యుమెంటేషన్ జరిగి నెలలు గడుస్తున్నా తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అభ్యర్థులు (AEE Aspirants) గాంధీభవన్‌ను ముట్టడించారు. వెంటనే తమకు న్యాయం చేయాలని, రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తిచేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం మెట్లపై కూర్చుని నిరసన తెలిపారు.
హైదరాబాద్: డాక్యుమెంటేషన్ జరిగి నెలలు గడుస్తున్నా తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అభ్యర్థులు (AEE Aspirants) గాంధీభవన్‌ను ముట్టడించారు. వెంటనే తమకు న్యాయం చేయాలని, రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తిచేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం మెట్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఎన్నిసార్లు మంత్రులు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఆందోళన చేపట్టారు. నోటిఫికేషన్ ఇచ్చి రెండేండ్లు దాటినా ఇంకా రిక్రూట్మెంట్ కొలిక్కి రాలేందంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మార్చి నెలలో 1:2 నిష్పత్తిలో టీజీపీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసిందని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిందని వెల్లడించారు. డాక్యుమెంటేషన్ జరిగి మూడు నెలలు గడిచినా నియామకపత్రాలు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

కాగా, రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022, సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023 మే నెలలో పరీక్షలు నిర్వహించింది. అయితే ఇంతవరకు నియామక ప్రక్రియను మాత్రం కమిషన్ పూర్తిచేయలేకపోయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాగల రెండు రోజులు వర్ష సూచన
మెట్రోకు నష్టాల సెగ.. అర్థ సంవత్సరంలో రూ. 405 కోట్లకు పైగా లోటు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

