ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి.. ఆమె తల్లికీ కత్తిపోట్లు
మియాపూర్ పరిధిలోని ఆదిత్యనగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం కలకలం రేపింది.
- ఆమె తల్లికీ కత్తిపోట్లు.. ఆపై యువకుడి ఆత్మహత్యాయత్నం
మియాపూర్, డిసెంబర్ 13: మియాపూర్ పరిధిలోని ఆదిత్యనగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం కలకలం రేపింది. తనను కొంతకాలంగా దూరం పెడుతున్నదని కక్ష పెంచుకున్న యువకుడు యువతితోపాటు ఆమె తల్లిపై కత్తితో దాడిచేసి, తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం తాను గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసుల కథనం ప్రకారం..గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన హమాలీ సందీప్‌కుమార్ (22) అదే గ్రామానికి చెందిన వైభవి (19) మూడేండ్లుగా ప్రేమించుకుంటున్నారు.
అయితే, రెండేండ్లుగా సందీప్‌ను వైభవి దూరంపెడుతున్నది. ఈ ఏడాది మే నెలలో స్వగ్రామం రేపల్లె నుంచి వైభవి తన తల్లి శోభ (38), సోదరుడితో కలిసి మియాపూర్‌కు మకాం మార్చింది. ఇటీవల వైభవికి వేరే సంబంధాలు చూస్తున్నారని తెలుసుకొన్న సందీప్ రేపల్లె నుంచి మియాపూర్‌కు చేరుకొన్నాడు. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో వైభవి ఇంటివద్ద కత్తి పట్టుకొని హల్‌చల్‌చేశాడు. వైభవి, ఆమె తల్లి శోభపై దాడిచేశాడు. అనంతరం తాను సైతం గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అక్కడికి చేరుకొని ముగ్గురిని దవాఖానకు తరలించారు.
తల్లీకూతుళ్ల పరిస్థితి నిలకడగానే ఉన్నదని మియాపూర్ సీఐ తిరుపతి తెలిపారు. సందీప్ పరిస్థితి విషమంగా ఉండడంతో కోఠి ఈఎన్టీ దవాఖానకు తరలించినట్టు చెప్పారు. అతడికి గ్రీన్ యూనిట్ వైద్యుడు నాగరాజు ఆధ్వర్యంలో గొంతు సర్జరీ చేశారని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తిరుపతి వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

