హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): ప్రముఖ అంకాలజీ సర్జన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డు సభ్యుడు డాక్టర్ చంద్రకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది.
గ్లోబల్ ఫోరమ్ ఆఫ్ క్యాన్సర్ సర్జన్ (జీఎఫ్సీఎస్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నెబ్రస్క మెడికల్ సెంటర్‌కు డీన్‌గా వ్యవహరిస్తున్నారు.