గురుకులాల్లో ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్సీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశం కోసం ఉమ్మడి నోటిఫికేషన్ జారీ అయింది.
- ఫిబ్రవరి 11న అన్ని జిల్లాల్లో ఎంట్రెన్స్ ఎగ్జామ్
- ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నవారే అర్హులు
- ఆన్లైన్ దరఖాస్తుల కోసం జనవరి 6 వరకు గడువు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్సీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశం కోసం ఉమ్మడి నోటిఫికేషన్ జారీ అయింది. ఇంగ్లిష్ మీడియం విద్యాభ్యాసం అందుబాటులో ఉన్న ఈ గురుకులాల్లో ప్రవేశాల కోసం 2023-24 విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్నవారు అర్హులుగా నిర్ణయించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమయింది.
దరఖాస్తులు చేసుకోడానికి జనవరి 6 వరకు గడువు విధించినట్టు జిల్లా గురుకులాల పరీక్ష కో-ఆర్డినేటర్ తెలిపారు. ప్రవేశ పరీక్ష వచ్చే ఫిబ్రవరి 11న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల్లోని నిర్ణీత పరీక్షా కేంద్రాల్లో కొనసాగే ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫీజు రూ.100గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఆయా గురుకుల విద్యాలయ సంస్థల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని, లేదా 180042545678 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా తమను సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

