నేరేడుచర్ల, జనవరి 23 : నేరేడుచర్ల మున్సిపాలిటీ(Nereducharla )చైర్మన్ జయబాబు పై పెట్టిన అవిశ్వాస తీర్మానం సంబురాల్లో అపశృతి చోటు చేసుకుంది. మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్ కార్యాలయంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది.
ఈ సందర్భంగా.. పటాకులు కాలుస్తుండగా పట్టణానికి చెందిన రవి అనే యువకుడి చేతిలో బాంబులు(Bomb exploded) ఉన్నాయి. అదే సమయంలో ఎదురుగా మరో వ్యక్తి బాంబులు కాలుస్తుండగా, ఆ నిప్పురవ్వలు రవి చేతిలో ఉన్న బాంబులకు తగలడంతో చేతిలో ఉన్న బాంబు పేలి చేతి వేళ్లన్నీ నుజ్జు నుజ్జు అయిపోయాయి. వెంటనే ఆ యువకుడిని బైక్ పై హాస్పిటల్కి తరలించారు.