Tomato Price | సామాన్యులకు గుడ్‌న్యూస్.. దిగొస్తున్న టమాట ధరలు.. 63కే కిలో!
Tomato Price | దాదాపు రెండు నెలలుగా కొండెక్కి కూర్చున్న టమాటా ధరలు నెమ్మదిగా దిగివస్తున్నాయి. మార్కెట్లోకి టమాటా రాక పెరగడంతో రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి.
Tomato Price | హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): దాదాపు రెండు నెలలుగా కొండెక్కి కూర్చున్న టమాటా ధరలు నెమ్మదిగా దిగివస్తున్నాయి. మార్కెట్లోకి టమాటా రాక పెరగడంతో రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం వరకు రూ.4,300 పలికిన 23 కేజీల బాక్సు ధర ప్రస్తుతం రూ. 2,300కి తగ్గింది. నాణ్యతను బట్టి బాక్సు ధర రూ.1500 నుంచి రూ.2,300 వరకు పలుకుతున్నది. రైతు బజార్లలో కిలో టమాటా రూ. 65-100 మధ్య పలుకుతోంది. బయట మార్కెట్లో మాత్రం రూ. 120-140 మధ్య ఉంది.
పది రోజుల క్రితం నగరంలోని హోల్‌సేల్ మార్కెట్‌కు 850 క్వింటాళ్ల టమాటా రాగా సోమవారం ఏకంగా 2,450 క్వింటాళ్ల టమాటా వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతరంపురంతోపాటు కర్ణాటక నుంచి కూడా హైదరాబాద్‌కు టమాటాలు వస్తున్నాయి. దీనికితోడు రంగారెడ్డి, చేవెళ్ల, నవాబ్‌పేట, మెదక్, వికారాబాద్ జిల్లాల నుంచి కూడా మార్కెట్‌కు టమాటాలు పోతెత్తడంతో ధర తగ్గుముఖం పట్టింది. ఈ నెలాఖరుకు కిలో టమాటా రూ. 50కి తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
దొంగల బెడదతో టమాటా పంటకు సీసీ కెమెరాలు
విలువైన వస్తువుల జాబితాలో టమాటా చేరిపోయింది. ఇటీవలి కాలంలో వరుసగా టమాటాల చోరీ ఘటనలు చోటుచేసుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా షాపూర్ బంజర్‌కు చెందిన శరద్ రావతే అనే ఓ రైతు తన టమాటా పొలం వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకొన్నాడు. దొంగల బెడద ఎక్కువైందని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Telangana
- Tomato
- Tomato Price
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

