శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద
శ్రీరాంసాగర్ | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 61,310 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తి 1,24,800 క్యూసెక్కుల నీటిని దిగువకు

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 61,310 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తి 1,24,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి కోసం 7500 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1090.5 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. గరిష్ఠ నీటినిల్వ 90 టీఎంసీలకుగాను 87.561 టీఎంసీలు ఉన్నది.

ఉధృతంగా గోదారి
ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో క్రమంగా ప్రవాహం పెరుగుతున్నది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కుండపోతగా వాన కురిసింది. దీంతో గోదావరిలోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. కందకుర్తి వద్ద పురాతన శివాలయం పూర్తిగా నీటమునిగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

