Singareni | సింగరేణిలో గని పై కప్పు కూలి నలుగురి మృతి
Singareni | మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ డివిజన్ ఎస్సార్పీ 3 గనిలో బుధవారం ఉదయం గనిపైకప్పు కూలి నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గనిలోని 21 డిప్ 24

-మంచిర్యాల జిల్లా ఎస్సార్పీ 3గనిలో ప్రమాదం
-నలుగురి మృతదేహాలు లభ్యం
-సంతాపం తెలిపిన మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, సంస్థ సీఎండీ శ్రీధర్
మంచిర్యాల, నవంబర్ 10: మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ డివిజన్ ఎస్సార్పీ 3 గనిలో బుధవారం ఉదయం గనిపైకప్పు కూలి నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గనిలోని 21 డిప్ 24 లెవల్, 3ఎస్పీ 2 సీం వద్ద గని పైకప్పు రక్షణ చర్యలు చేపడుతున్న టింబర్‌మెన్ బేర లచ్చయ్య (60), సపోర్ట్‌మెన్ వీ క్రిష్ణారెడ్డి (59), బదిలీ వర్కర్లు గడ్డం సత్యనర్సింహారాజు (30), రెంక చంద్రశేఖర్(30)కార్మికులు బండ కింద కూరుకుపోయి అక్కడికక్కడే మరణించారు.
ప్రమాద సమాచారం తెలుసుకున్న గని అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ టీంతో సహాయక చర్యలు చేపట్టారు. గనిపై కప్పు 14 మీటర్ల పొడవు, 10 ఫీట్ల వెడల్పు, 15 ఫీట్ల మందంతో కూలిందని అధికారులు తెలిపారు. కార్మికులు గని పై కప్పు సపోర్టు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద స్థలాన్ని సందర్శించిన అధికారులు, నాయకులు
గని ప్రమాద స్థలాన్ని బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం బల్లారి శ్రీనివాస్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ గోసిక మల్లేశం సందర్శించి సహాయక చర్యలు చేపట్టారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మాజీ అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, వివిధ సంఘాల నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గని ప్రమాదం పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
ప్రమాదంపై మంత్రులు హరీశ్‌రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
గని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందడంపై గుర్తింపు కార్మిక సంఘం, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రులు హరీశ్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికుల మృతి దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కార్మికుల కుటుంబాలకు టీబీజీకేఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఇక పై ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా రక్షణ చర్యలు పటిష్టం చేయాలని అధికారులను కోరారు.
ప్రమాదంపై యాజమాన్యం సంతాపం
గని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందడంపై సంస్థ సీఅండ్ఎండీ ఎన్ శ్రీధర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై తక్షణమే విచారణ జరిపి నివేదికనివ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.బాధిత కుటుంబాలకు కంపెనీ అండగా ఉంటుందని తెలిపారు. కంపెనీ తరపున చెల్లించాల్సిన సొమ్మును తక్షణమే వారి కుటుంబసభ్యులకు అందజేయాలని ఆదేశించారు. కార్మికుల మృతి ఆ కుటుంబంలో తీవ్ర శోకం నింపుతుందని, వారు లేని లోటు కంపెనీ తీర్చలేక పోయినప్పటికీ తోటి సింగరేణి కుటుంబ సభ్యులుగా వారికి యాజమాన్యం అండగా ఉంటుందని తెలిపారు. దీనిలో భాగంగా కార్మికుల కుటుంబీకుల్లో అర్హులైన ఒకరికి తక్షణమే వారు కోరుకున్న ఏరియాలో ఉద్యోగం కల్పించనున్నామని ప్రకటించారు. అలాగే గని మ్రాదంలో మృతి చెందిన కార్మికులకు యాజమాన్యం తరపున చెల్లించే మ్యాచింగ్ గ్రాంట్, గ్రాట్యూటీ తదితర చెల్లింపులు కలుపుకొని సుమారు రూ. 70 లక్షల నుంచి రూ. కోటి వరకు అందజేయనున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయన సంబంధిత అధికారులకు మౌఖిక ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

