హైదరాబాద్, జూలై 6(నమస్తే తెలంగాణ): డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిన 2,858 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కాంట్రాక్ట్ పద్ధతిన 527 లెక్చరర్ పోస్టులు, ఔట్ సోర్సింగ్‌లో 341 ఉద్యోగాలు, గౌరవ వేతనం కింద 50 టీఎస్కేసీ ఫుల్‌టైమ్ మెంటర్ల పోస్టులు, 1,940 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టుల కాలపరిమితి 2024, మార్చి 31తో ముగియనున్నది.