రాష్ట్రంలో కొత్తగా 23 ఆర్వోబీలు
రాష్ట్రంలోని 23 రైల్వే క్రాసింగ్‌ల వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)ల నిర్మాణానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో 5 ఆర్వోబీలకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి.
- రైల్వే క్రాసింగ్‌ల వద్ద నిర్మాణం
- ఐదు ఆర్వోబీల టెండర్లు పూర్తి
- త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 23 రైల్వే క్రాసింగ్‌ల వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)ల నిర్మాణానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో 5 ఆర్వోబీలకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. మిగిలిన 18 ఆర్వోబీలకు ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు సిద్ధం చేస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా దేశంలోని నలుమూలలనూ కలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్ మాల’ ప్రాజెక్టుతోపాటు ‘గోల్డెన్ క్వాడ్రిలేటరల్-గోల్డెన్ డయాగోనల్’ (జీక్యూ-జీడీ) ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా దేశం మధ్య నుంచి సాగుతున్న చెన్నై-ఢిల్లీ రైలు మార్గంలోని విజయవాడ-బలార్షా సెక్షన్లో ఖమ్మం-కాగజ్‌నగర్ మధ్య 18 రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఆర్వోబీలను నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్ సహా ఆర్వోబీల నిర్మాణానికి అయ్యే ఖర్చంతా భరించేందుకు రైల్వేశాఖ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో వీటి నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ అనుమతి మంజూరు చేయడంతో రైల్వేశాఖ ఆధ్వర్యంలో డీపీఆర్‌లు తయారవుతున్నాయి. ఇవి సిద్ధమవగానే టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు చేపడతారు. ఈ ఆర్వోబీల నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్ కార్యక్రమాల్లో సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఇవికాకుండా కేంద్ర ప్రభుత్వ ‘సేతు భారతం’ పథకంలో భాగంగా రాష్ట్రంలో మరో 5 రైల్వే క్రాసింగ్‌లపై ఆర్ర్వోబీలు మంజూరయ్యాయి. ఇప్పటికే వీటి టెండర్లు పూర్తవడంతో త్వరలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఈ 5 ఆర్వోబీల నిర్మాణానికి అయ్యే రూ.432.84 కోట్ల ఖర్చును రైల్వేశాఖ భరించనున్నది. భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్‌కు అయ్యే రూ.96 కోట్ల ఖర్చును భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
ప్రతిపాదిత 23 ఆర్వోబీలు నిర్మించే ప్రాంతాలు
బలార్షా-కాజీపేట సెక్షన్‌లోని కాజీపేట-హసన్‌పర్తి, బిజగిర్షరీఫ్-పొత్కపల్లి, బిజగిర్షరీఫ్-పొత్కపల్లి-2, పొత్కపల్లి-కొలనూర్, కొలనూర్-పెద్దపల్లి, పెద్దపల్లి-రాఘవాపురం, రామగుండం-రాఘవాపురం, రాఘవాపురం-రామగుండం, రామగుండం-పెద్దంపేట, రేపల్లెవాడ-ఆసిఫాబాద్, కాజీపేట-విజయవాడ సెక్షన్‌లోని వరంగల్ లెవెల్ క్రాసింగ్ నం-64, ఎల్గూర్-నెక్కొండ, మహబూబాబాద్ లెవెల్ క్రాసింగ్ నం-80, పాపటపల్లి-ఖమ్మం, ఖమ్మం-పందిళ్లపల్లి, ఖమ్మం లెవెల్ క్రాసింగ్ నం-107/ఎం, ఖమ్మం లెవెల్ క్రాసింగ్ నం-113/ఎం, ఖమ్మం లెవెల్ క్రాసింగ్ నం-120/ఎం, ఖమ్మం లెవెల్ క్రాసింగ్ నం-129/ఎం, సేతు భారతం పథకం కింద నిజామాబాద్, కరీంనగర్ యార్డ్, ఎన్ఐటీ వరంగల్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్, తాండూరు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- railway crossings
- RBO
RELATED ARTICLES
తాజా వార్తలు
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

