నయవంచకుడు ఈటల

- హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు
- యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ వంశీయాదవ్
- 150 మందితో కలిసి యూత్ కాంగ్రెస్‌కు రాజీనామా
- ఈటలను ఓడిస్తామని ప్రతిన.. భారీ బైక్ ర్యాలీ
జమ్మికుంట, జూలై 6 : ఉద్యమకారుడినని చెప్పుకొని పదవులన్నీ అనుభవించి, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిన నయవంచకుడు ఈటల రాజేందర్ అని యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ జనరల్ సెక్రెటరీ కే వంశీయాదవ్ మండిపడ్డారు. ఈటల అక్రమాలపై పోరాటాలు చేసినప్పటికీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదని నిరసిస్తూ.. ఐదు మండలాలకు చెందిన 150 మంది యూత్ కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల మైదానం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈటలను ఓడిస్తామని అంబేద్కర్ విగ్రహ సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వంశీయాదవ్ మాట్లాడుతూ.. ఈటల అక్రమాలపై పోరాటాలు చేస్తున్నామని, నియోజకవర్గ కాంగ్రెస్ నుంచి ఏ నాయకుడు తమకు అండగా నిలవట్లేదని తెలిపారు. ఈటల అవినీతి, అక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. త్వరలో భవిష్యత్ కార్యచరణ తెలియజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రశాంత్‌యాదవ్, నాగిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శశికుమార్, రాకేశ్, సాయికృష్ణ, సతీశ్, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

