చౌటుప్పల్‌లో ప్రైవేటు బస్సు, టిప్పర్ ఢీ..
ప్రైవేటు బస్సు | యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌లో పెను ప్రమాదం తప్పింది. మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సును టిప్పర్ ఢీకొట్టింది.

చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌లో పెను ప్రమాదం తప్పింది. మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ట్రావెల్స్ బస్సు, టిప్పర్ డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో విజయవాడ-హైదరాబాద్ రహదారిపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలచిపోయింది. దీంతో ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Accident
- Choutuppal
- lakkaram
- NH 65
RELATED ARTICLES
తాజా వార్తలు
King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

