TS EAMCET | హాట్ కేకుల్లా కంప్యూటర్ కోర్సులు.. ట్రిపుల్ ఈ, సివిల్‌కు లేని ఆదరణ
TS EAMCET | హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో తొలి విడుత సీట్ల కేటాయింపు జరిగింది. మొత్తం 82,666 ఇంజినీరింగ్ సీట్లు ఉండగా, ఫస్ట్ ఫేజ్‌లో 70,665 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 12,001 సీట్లు మిగిలి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఏడాది కంప్యూటర్ కోర్సుల్లో సీట్లన్నీ నిండిపోయాయి. ట్రిపుల్ ఈ, సివిల్ ఇంజినీరింగ్ కోర్సులకు పెద్ద ఆదరణ లభించలేదు.
TS EAMCET | హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో తొలి విడుత సీట్ల కేటాయింపు జరిగింది. మొత్తం 82,666 ఇంజినీరింగ్ సీట్లు ఉండగా, ఫస్ట్ ఫేజ్‌లో 70,665 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 12,001 సీట్లు మిగిలి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఏడాది కంప్యూటర్ కోర్సుల్లో సీట్లన్నీ నిండిపోయాయి. ట్రిపుల్ ఈ, సివిల్ ఇంజినీరింగ్ కోర్సులకు పెద్ద ఆదరణ లభించలేదు.
కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సుల్లో 94.20 శాతం సీట్లు భర్తీ కాగా, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 78.70 శాతం, సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 44.09 శాతం, ఇతర ఇంజినీరింగ్ కోర్సుల్లో 63.03 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సులను పరిశీలిస్తే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టం, సీఎస్ఈ(ఐవోటీ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇన్క్లూడింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ)లో, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ నెట్వర్క్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో 100 శాతం సీట్లు నిండిపోయాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్(సీఎస్ఈ)లో 98.70 శాతం సీట్లు నిండినట్లు ఎంసెట్ కన్వీనర్ వెల్లడించారు.
ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కోర్సులకు సంబంధించి.. బయో మెడికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్(ఈసీఐ), ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమెటిక్స్(ఈటీఎం) కోర్సుల్లో 100 శాతం సీట్లు భర్తీ కాగా, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్(ఈసీఈ)లో 87.10 శాతం సీట్లు నిండాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్(ఈఈఈ)లో కేవలం 58.38 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించి.. మెటలార్జికల్ ఇంజినీరింగ్(ఎంఈటీ), బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్(ఎంఎంఎస్), బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ థర్మల్ ఇంజినీరింగ్(ఎంటీఈ), ఏరోనాటికల్ ఇంజినీరింగ్, మెకానికల్(మెక్‌ట్రోనిక్స్) ఇంజినీరింగ్(ఎంసీటీ), ఆటో మొబైల్ ఇంజినీరింగ్‌లో 100 శాతం సీట్లు, సివిల్ ఇంజినీరింగ్‌లో 44.76 శాతం సీట్లు, మెకానికల్ ఇంజినీరింగ్(ఎంఈసీ)లో 38.50 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
కెమికల్ ఇంజినీరింగ్‌లో 98.65 శాతం, జియో ఇన్ఫర్మెటిక్స్‌లో 95.38 శాతం, అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో 93.94 శాతం సీట్లు నిండాయి. ఇండస్ట్రీయల్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

