Chicken | స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఏటా 36 కోట్ల టన్నుల జంతువుల మాంసాన్ని ఆహారంగా తీసుకొంటున్నారు. చేపలు వంటి సముద్ర జీవులను కూడా ఇందులో కలిపితే మాంసం మోతాదు 100 కోట్ల టన్నులు దాటుతుంది. చేపలు మినహా మనుషులు ఎక్కువగా తీసుకొంటున్న మాంసాహార జాబితాలో చికెన్ ముందు వరుసలో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 1.4 లక్షల కోళ్లను తింటున్నట్టు అవర్ వరల్డ్ ఇన్ డాటా తాజా నివేదిక వెల్లడించింది. మాంసం ఎక్కువగా తీసుకొంటున్న దేశాల జాబితాలో చైనా అగ్రస్థానంలో ఉన్నది.