పారదర్శకంగా భూ వేలం

- కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీ ద్వారా ఈ-ఆక్షన్
- అన్నిదశల్లో పనులు సాఫీగా సాగేందుకు 4 కమిటీలు
- భూముల గుర్తింపు బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు అప్పగింత
- వేలానికి ముందే లే ఔట్లకు అన్ని వసతులు, అనుమతులు
- స్థలం కొన్నవారికి ఏడు రోజుల్లో పత్రాలు అందజేత
- మార్గదర్శకాలు జారీచేసిన సీఎస్ సోమేశ్‌కుమార్
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): వివిధ శాఖల వద్ద నిరుపయోగంగా ఉన్న భూములను వేలం వేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. భూముల గుర్తింపు, అభివృద్ధి, వేలానికి నిర్దిష్ట మార్గదర్శకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం జారీచేశారు. వేలం బాధ్యతను నోడల్ ఏజెన్సీకి అప్పగించిన ప్రభుత్వం, ఈ ప్రక్రియను సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు నాలుగు కమిటీలను ఏర్పాటుచేసింది. జిల్లాల్లో ప్రజా అవసరాలకు ఉపయోగపడని భూములను కలెక్టర్లు సేకరించాల్సి ఉంటుంది. కనీసం వెయ్యి ఎకరాలకు తగ్గకుండా ల్యాండ్‌బ్యాంకు ఏర్పాటుచేయనున్నారు. మార్కెట్ డిమాండ్, ధరలను బట్టి భూములను ఈ-వేలం ద్వారా అమ్మాలని ప్రభుత్వం సూచించింది. గుర్తించిన భూములను వేలానికి ముందే లేఔట్స్గా మార్చి టీఎస్ బీపాస్ ద్వారా అన్ని అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకొంటారు. లేఅవుట్స్లకు అన్నిరకాల వసతులు ఏర్పాటు చేస్తారు.
ఇవీ మార్గదర్శకాలు..
- ముందుగా ఎలాంటి న్యాయ వివాదం లేని భూముల వివరాలను సేకరించి హద్దులు ఏర్పాటుచేయాలి.
- సేకరించిన భూములను బహుళ అవసరాలకు ఉపయోగపడేలా నోటి ఫై చేయాలి. అవసరమైన వాటికి హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అనుమతులు వెంటనే వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
- అవసరమైన అన్ని అనుమతులను టీఎస్-బీపాస్ ద్వారా తీసుకోవాలి. దరఖాస్తు చేసిన వారంలోపే ఫైర్ ఎన్వోసీ, ఈసీ/సీఎఫ్ఈ వచ్చేలా చూడాలి.
- ఈ-వేలం షెడ్యూల్ జారీకి నోడల్ డిపార్ట్మెంట్కు అధికారాలు.
- స్థానిక మార్కెట్ రేట్లకు అనుగుణంగా వేలం వేసే భూములకు ధరలను నోడల్ ఏజెన్సీ నిర్ణయించాలి. అవసరమైతే కన్సల్టెంట్స్ను నియమించుకోవచ్చు. మార్కెట్ డిమాండ్, ధరలను బట్టి భూముల అమ్మకానికి నోటిఫికేషన్ ఇవ్వాలి.
- ఈ-వేలం కోసం కేంద్రప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీని నియమించుకొనేందుకు అనుమతి. అవసరమైతే ప్రైవేటు ఏజెన్సీలను కూడా నియమించుకోవచ్చు. నోడల్ ఏజెన్సీ డిపార్ట్మెంట్లో ఈ-వేలం సెల్ ఏర్పాటు చేయాలి.
- బిడ్స్ ఫైనల్ చేసేందుకు నోడల్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ.
- వేలంలో భూమి దక్కించుకొన్న వ్యక్తి డబ్బులు చెల్లించిన మూడు వారాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు సదరు భూమిని అప్పగించాలి.
- నోడల్ డిపార్ట్మెంట్కు ఇచ్చిన అధికారాలు
- భూముల ధరను నిర్ణయించడం.
- నోటిఫికేషన్ ఇవ్వడం.
- ఈ-వేలం కోసం ఎంఎస్టీసీ సేవలు వినియోగించుకోవడం.
- ప్లాట్లు అమ్మగా వచ్చే ఆదాయంలో 2 శాతం నిధులను వివిధ పనులకు ఉపయోగించుకోవడం.
- ఆదాయం నుంచి ఎంఎస్‌టీసీకి చెల్లింపులు.
- బిడ్స్ ఫైనల్ చేసేందుకు కమిటీ ఏర్పాటు.
- భూముల అమ్మకానికి విధి విధానాలకు ఆమోదం తెలపడం.
- ఈ-వేలం కోసం షెడ్యూల్ జారీ చేయడం.
- వేలంలో భూమిని లేదా ప్లాట్‌ను దక్కించుకొన్న బిడ్డర్‌కు ఏడు రోజుల్లో సంబంధిత పత్రాలు అందజేయడం. పారదర్శకంగా భూ వేలం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

