హైదరాబాద్, డిసెంబర్18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి సాగునీటిశాఖ అధికారులు కొత్త మార్గదర్శకాలను రూపొందించారు. ఇటీవలనే వాటిని సంబంధిత చీఫ్ ఇంజినీర్లకు అందజేశారు. మార్గదర్శకాల ప్రకారం.. చెక్‌డ్యామ్ నిర్మాణానికి వాగులో ఎలాంటి మూలవంకలు లేనిప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. 2 నుంచి 3 మీటర్ల లోతు వరకు ఫౌండేషన్ వేయాలి. అత్యధిక వరదస్థాయిని అంచనా వేసుకొని, ఆ మేరకు ఎత్తు నిర్మించాలి. చెక్‌డ్యామ్‌కు ఇరువైపులా నిర్మించిన సైడ్‌వాల్స్ మట్టి.. వరద కోతకు గురికాకుండా 25 మీటర్ల మేర రాళ్లను పేర్చాలి. చెక్‌డ్యామ్ ప్రతిపాదిత ప్రదేశాన్ని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తప్పకుండా క్షేత్రస్థాయిలో సందర్శించాలని సూచించారు.