ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభించిన సేవా భారతి

హైదరాబాద్: నగరంలో సేవా భారతి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభమయ్యాయి. ఉచిత అంబులెన్స్ సేవలు కావాలనుకునేవారు 040-48213100 నంబర్‌ను సంప్రదించాలని సేవాభారతి ప్రతినిధులు తెలిపారు. బర్కత్‌పురా కేశవనిలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబులెన్సులను ప్రారంభించారు. సేవా భారతి ఇటీవలే హైదరాబాద్ నగర శివార్లలోని అన్నోజిగూడలో ఉచిత కోవిడ్ ఐసొలేషన్ సెంటర్ ప్రారంభించింది. 200 పడకల ఈ కేంద్రంలో పెద్ద సంఖ్యలో డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, యోగా సిబ్బంది కోవిడ్ పేషంట్లకు సేవలందిస్తున్నారు. ఈ కేంద్రంలో ఇప్పటికే వందలాది మంది చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ స్వల్ప లక్షణాలు కలిగి ఉండి అన్నోజిగూడ ఉచిత కోవిడ్ ఐసొలేషన్ సెంటర్లో అడ్మిట్ కావాలనుకునేవారు ముందుగా 040-48212529 నెంబర్‌ను సంప్రదించాలని సేవాభారతి ప్రతినిధులు తెలిపారు.
Read Today's Latest Telangana-photos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

