ఇంకో నెల రోజుల్లో 2021 కి గుడ్‌బై చెప్పేయబోతున్నాం. త్వరలోనే 2022 సంవత్సరానికి స్వాగతం పలుకబోతున్నాం. ఏదైనా కొత్త సంవత్సరం రాగానే ముందుగా అందరూ ఎదురు చూసేది.. ఆ సంవత్సరంలో ఉన్న సెలవులు, పండుగల కోసం.
తాజాగా 2022వ సంవత్సరానికి సంబంధించిన పబ్లిక్ సెలవులు, జనరల్ సెలవులు, ఆప్షనల్ సెలవుల లిస్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.
నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్(Negotiable Instruments Act) ప్రకారం.. 2022లో 23 పబ్లిక్ హాలీడేస్ ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు 28 జనరల్ హాలీడేస్, 5 ఆప్షనల్ సెలవులు ఉన్నాయి. పండుగల కోసం, స్పెషల్ డేస్ కోసం 23 నోటిఫైడ్ సెలవులు ఉన్నాయి.
అలాగే… అన్ని ఆదివారాలు, రెండో శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూసి ఉంటాయి. కానీ.. ఫిబ్రవరి 12న(రెండో శనివారం) మాత్రం ప్రభుత్వ కార్యాలయాలు తెరిచే ఉంటాయి. జనవరి 1, 2022 న ప్రభుత్వ కార్యాలయాలకు సెలవును ప్రకటించడం వల్ల.. ఫిబ్రవరి 12న ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి ఉండనున్నాయి.