Blue Zones | ప్రపంచంలో శతాధికులు అధికంగా ఉన్న ప్రదేశాలు ఏవి? దీర్ఘాయువుకు కారణాలేంటి?
ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సంపూర్ణ జీవితానికి ఎలాంటి మాత్రలు ఉండవు. మంత్రాలూ పనిచేయవు. జీవనశైలిలో మార్పులతో ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు. ప్రపంచంలో శతాధికులు అధికంగా ఉన్న ప్రదేశాలు ఐదు ఉన్నాయి. వీటిని పరిశోధకులు ‘బ్లూ జోన్స్' అని పేర్కొన్నారు. ఒకినావా (జపాన్), సార్డీనియా (ఇటలీ), లోమా లిండా (అమెరికా), నికోయా పెనిన్సులా (కోస్టారికా), ఐకారియా (గ్రీస్).. ఆ జాబితాలోకి వస్తాయి.
Blue Zones | ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సంపూర్ణ జీవితానికి ఎలాంటి మాత్రలు ఉండవు. మంత్రాలూ పనిచేయవు. జీవనశైలిలో మార్పులతో ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు. ప్రపంచంలో శతాధికులు అధికంగా ఉన్న ప్రదేశాలు ఐదు ఉన్నాయి. వీటిని పరిశోధకులు ‘బ్లూ జోన్స్’ అని పేర్కొన్నారు. ఒకినావా (జపాన్), సార్డీనియా (ఇటలీ), లోమా లిండా (అమెరికా), నికోయా పెనిన్సులా (కోస్టారికా), ఐకారియా (గ్రీస్).. ఆ జాబితాలోకి వస్తాయి. ఈ ప్రాంత ప్రజల శతాధిక ఆయువుకు తొమ్మిది ప్రధాన కారణాలను గుర్తించారు.
1. ప్రకృతికి దగ్గరగా..
ఈ ప్రాంతాల ప్రజలు దీర్ఘాయువు కోసం మందులూ మాకుల మీద ఆధారపడరు. పరుగులు, కసరత్తులూ చేయరు. సాధ్యమైనంత సహజంగా బతుకుతారు. పచ్చదనాన్ని ఇష్టపడతారు. ఉల్లాసంగా ఉంటారు. ఇంటిపనికి, తోటపనికి యంత్రాలను ఉపయోగించరు.
2. జీవిత ప్రయోజనం తెలుసు
ఒకినావాలో ఈ సూత్రాన్ని ‘ఇకిగాయ్’ అని పిలుస్తారు. నికోయన్లు ‘ప్లాన్ డి విడా’ అంటారు. ఈ రెండిటికీ ‘నేను ఉదయమే ఎందుకు మేల్కొంటానంటే..’ అని అర్థం. అలా తమ జీవిత ప్రయోజనాన్ని రోజూ గుర్తు చేసుకుంటారు. ఈ ఒక్క ఆలోచనతోనే మన జీవితకాలాన్ని ఏడేండ్లు పెంచుకోవచ్చట.
3. ఒత్తిడిని అధిగమిస్తూ..
సహజంగా గడిపేస్తారంటే బ్లూ జోన్ ప్రజలకు ఒత్తిడి ఉండదని కాదు. తప్పక ఉంటుంది. అయితే ఒత్తిడిని జయించడానికి.. రోజువారీ పనిలో మధ్యమధ్య విశ్రాంతి తీసుకుంటారు. ఒకినావా ప్రజలు ఒత్తిడిగా అనిపించినప్పుడు ఓ రెండు నిమిషాలపాటు పూర్వికులను తలుచుకుంటారట. మిగిలిన ప్రాంతాల్లో అయితే ‘హ్యాపీ అవర్’ అని ఓ గంటపాటు ఆనందానికే కేటాయించుకుంటారు.
4. 80 శాతం నియమం
హరా హచి బు 2500 ఏండ్ల కిందటి కన్ఫూషియస్ మంత్రం. ఒకినావా ప్రజలు దీనిని అనుసరిస్తారు. తమ పొట్ట 80 శాతం నిండగానే తినడం ఆపేస్తారు. బ్లూ జోన్ ప్రజలు సాయంకాలం కొద్దిపాటి ఆహారమే తీసుకుంటారు. ఉదయం అల్పాహారం వరకు ఏమీ ముట్టుకోరు.
5. శాకాహారులు
బ్లూ జోన్ ప్రజలు తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు లాంటి శాకాహార పదార్థాలకు ప్రాధాన్యం ఇస్తారు. మాంసం (చాలావరకు పంది మాంసం) నెలకు ఐదుసార్లు మాత్రమే తీసుకుంటారు.
అదీ వంద గ్రాముల లోపే.
6. సాయంత్రం 5 గంటలకు వైన్
దాదాపుగా అన్ని బ్లూ జోన్ ప్రాంతాల ప్రజలు మితంగా వైన్ తీసుకుంటారు. ముఖ్యంగా రోజుకు ఒకటి రెండు గ్లాసుల వైన్ సేవిస్తారు. అలాగని అన్ని రోజులకు కలిపి వారాంతంలో 14 గ్లాసులు తీసుకోకూడదు.
7. అందరి కోసం అందరూ
బ్లూ జోన్ ప్రాంత ప్రజలు ఏదో ఒక విశ్వాసాన్ని అంటిపెట్టుకుని ఉంటారు. అలా నెలలో నాలుగుసార్లు అందరూ కలిసి సందడిగా గడుపుతారు. కలిసి తింటారు. ఇలా కలివిడిగా, ఆనందంగా ఉండటం వల్ల ఆయుఃప్రమాణం 4 నుంచి 14 ఏండ్లు పెరుగుతుందట.
8. బంధాల మనుషులు
బ్లూ జోన్ ప్రజల సుదీర్ఘ జీవితానికి కుటుంబ బంధాలు కూడా కారణమే. తాతయ్యలు, నానమ్మలు, తల్లిదండ్రులు, మనవలు, మనవరాళ్లు.. ఒకే ఇంట్లోనో, దగ్గరదగ్గరగానో నివసిస్తారు. దీంతో ఒంటరితనం, జబ్బు పడితే ఎవరు చూసుకుంటారన్న భయాలు ఉండవు. అందరితో ప్రేమగా ఉంటారు కాబట్టి మనసులో చెడు నిండుకోదు. సుదీర్ఘ జీవితానికి హామీ లభిస్తుంది.
9. సరైన పడవలోనే ప్రయాణం
సుదీర్ఘ జీవితం వెళ్లదీస్తున్న వారి చుట్టూ మంచి నడవడి కలిగిన మనుషులే ఉంటారు. వీరిలో దురలవాట్లు, అనారోగ్యకరమైన జీవన విధానం మచ్చుకైనా కనిపించవు. ఉదాహరణకు జపాన్‌లోని ఒకినావాలో ప్రతి ఒక్కరూ మరో నలుగురితో కలిసి ఐదుగురు సభ్యుల బృందంగా ఏర్పడతారు. వీరు ఒకరికొకరు అన్నివేళలా అండగా నిలుస్తారు.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

