యువ భారతి కథ
పవిత్రమైన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉగ్రవాద మూకలు నిరంతరం దాడులకు తెగబడుతూనే ఉన్నాయి. భారతసైన్యం ఎప్పటికప్పుడు ఆ దాడులను ప్రతిఘటిస్తూనే ఉంది. ఇటీవల కాలంలో జరిగిన ఆపరేషన్ సింధూరే అందుకు సాక్ష్యం. ఈ నవలలోని కథ ఇదే కోణంలో కొనసాగుతుంది.
పవిత్రమైన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉగ్రవాద మూకలు నిరంతరం దాడులకు తెగబడుతూనే ఉన్నాయి. భారతసైన్యం ఎప్పటికప్పుడు ఆ దాడులను ప్రతిఘటిస్తూనే ఉంది. ఇటీవల కాలంలో జరిగిన ఆపరేషన్ సింధూరే అందుకు సాక్ష్యం. ఈ నవలలోని కథ ఇదే కోణంలో కొనసాగుతుంది. పాకిస్థాన్ నుంచి 10 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడతారు. వారిలో ఏడుగురిని మన సైన్యం హతమార్చగా ముగ్గురు తప్పించుకుంటారు. ఆ సమయంలోనే జమ్ము నుంచి 20మంది విద్యార్థినులు శ్రీనగర్‌కు ఓ బస్సులో బయలుదేరుతారు. ఆ బస్సులోనే మన కథానాయకి భారతి ఉంది. ఆమె తండ్రి ఆర్మీ అధికారి బలదేవ్ శర్మ. బస్సులో అమ్మాయి రక్షణ కోసం కమాండోలను సైతం పంపుతాడు శర్మ. సైన్యం నుంచి తప్పించుకున్న ఆ ముగ్గురు తీవ్రవాదులు దాడికి దిగి బస్సును తమ అధీనంలోకి తీసుకుంటారు.
భారతి ప్రాణాలకు తెగించి తనతో వచ్చిన వాళ్లందరిని కాపాడుతుంది. ఆ దాడిలో ఇద్దరు తీవ్రవాదులు మృతిచెందుతారు. మూడోవాడైన అక్బర్.. భారతిని కిడ్నాప్ చేసి తను అనుకున్న పనిని పూర్తి చేయాలనే పథకం వేస్తాడు. అయితే భారతి తెలివిగల అమ్మాయి. తన మాటలతో అక్బర్‌ను మామూలు మనిషిగా మార్చుతుంది. ఒక ముప్పై రోజులపాటు మనిషిగా బతికిచూడు అని హితబోధ చేస్తుంది. అతణ్ని జమ్మూలోని తన ఇంటికి తీసుకొస్తుంది. తన ఇంట్లో ఉన్నది ఉగ్రవాది అబ్బర్ అని తెలిసి అతణ్ని పట్టుకునేందుకు శర్మ బయల్దేరుతాడు. అదే సమయంలో అక్బర్ తన తాతను కలుసుకోవడానికి ముంబైకి వెళ్తాడు. అక్బర్‌కు ప్రాణాపాయం ఉందని తెలిసి వెంటనే భారతి సైతం ముంబైకి వెళ్తుంది.
అక్బర్ కంటే ముందే అతనివాళ్లను కలుస్తుంది. ఆ సమయంలోనే అక్బర్ తల్లిదండ్రులు గురించి తెలుసుకుంటుంది. కాగా, అక్బర్ అసలు పేరు భరత్, తన తండ్రి సైన్యంలో పనిచేస్తూ యుద్ధంలో మరణించగా, తల్లి రైలు ప్రమాదంలో మృతి చెందుతుంది. అక్బర్‌ను సలీమ్ పెంచి పెద్దచేస్తాడు. గొప్పగా చదువుకొని ప్రయోజకుడు అవుతాడనుకున్న అక్బర్ తీవ్రవాదుల్లో చేరుతాడు. అక్బర్ గురించి నిజాలు తెలిసిన తరువాత ఈ దేశ పౌరుడిని కాపాడటం తన బాధ్యతగా భావిస్తుంది భారతి. తన తండ్రి వృత్తికి ఇది ఆటంకమని తెలిసినా వెనుకడుగు వేయదు. చివరికి దేశం కోసం ఆ తీవ్రవాదులను అక్బర్తోనే చంపించడంతో కథ సుఖాంతమవుతుంది. ఈ నవల చదువుతున్నంత సేపు భారతి గొప్ప మనవతా మూర్తిగా కనిపిస్తుంది. తనను కాపాడేందుకు భారతి ఎందుకంత కష్టపడుతుందో అక్బర్‌కు పూర్తిగా అర్థం కాకున్నా ఆమెలో ఒక ధైర్యాన్ని చూసుకుంటాడు. యువతరమంటే సోషల్‌మీడియా పిచ్చోళ్లే కాదు.. సోషల్ రెస్పాన్స్‌బిలిటీ ఉన్నోళ్లని ఈ నవల అద్దం పడుతుంది.
పుస్తక సమీక్ష: సారే జహా సే అచ్ఛా! (నవల)
రచయిత: సింగీతం ఘటికాచలరావు
పేజీలు:175, ధర: రూ.250
ప్రతులకు: 95004 31474
– రాజు పిల్లనగోయిన
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఆ ఉత్తర్వులు బీజేపీ కార్యకర్తలకు రోజ్‌గార్ గ్యారెంటీ’
అద్వానీకి ఛాతీలో ఇన్ఫెక్షన్ దవాఖానలో చేరిక
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

