అన్ని విషయాల్లో అద్భుతః అనిపించే ఊదా రంగు ఆలుగడ్డ
ఆలుగడ్డ మామూలుగానే ఉంటుంది కదా ఈ ఊదా రంగు ఆలు ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటున్నారా. అదేనండి ఇటీవల శాస్త్రవేత్తలు ‘కుర్ఫీ జామూనియా’ పేరుతో ఈ ఊదా రంగు ఆలుగడ్డను అభివృద్ధి చేశారు. ఈ ఊదా రంగు ఆలుగడ్డ కూడా అన్ని విషయాల్లో అద్భుతః అనిపిస్తుందని సైంటిస్టులు వెల్లడించారు. ఇంకేంటి దీని గురించి తెలుసుకుందామా..
పర్పుల్ ఆలు.. భలే పవర్ఫుల్!
బ్యాచిలర్స్ ఫేవరెట్ వంటకం ఏంటి? చిటికెలో వడ్డించాలంటే అమ్మ చేసే కూర పేరు? చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ చాలా మందికి ఇష్టమైన వేపుడు ఏది? చారుకు మంచి జోడీ… ఏ వెజిటబుల్ కర్రీ?!… ఈ ప్రశ్నలన్నింటికీ ఒక్కటే సమాధానం చెప్పాలంటే… అది ఆలూనే. పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే దీన్ని ఇప్పుడు పోషకాల మెండుగా తీర్చిదిద్దారు భారత శాస్త్రవేత్తలు. ఊదా వర్ణంలో ప్రత్యేకంగా కనిపించే దీని విశేషాలు కూడా సాదాసీదా ఏం కాదు.
నిండైన రంగులు కండ్లనెప్పుడూ ఆకర్షిస్తాయి. ‘కుర్ఫీ జామూనియా’ అనే పేరుతో ఇటీవల శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ ఊదా రంగు ఆలుగడ్డలు కూడా అచ్చంగా అదే కోవకు చెందుతాయి. సాధారణంగా తక్కువ ధరలో విరివిగా దొరకడంతో పాటు రుచి కూడా బాగుండటంతో వంటల్లో ఆలుగడ్డలు రాజ్యమేలుతుంటాయి. ఇంకా చెప్పాలంటే కూరల్లో ఆలుగడ్డ ఓ ఎమోషన్. ముద్ద కూర, బరడా, ఫ్రై, ఫ్రెంచ్ ఫ్రైస్, రోల్స్… ఇలా దీనితో పెనవేసుకున్న వంటకాలు, చిరుతిళ్ల పొడవు పెన్నా నది అంత ఉంటుంది. అందుకే అందులోనే వెరైటీలు పండించేలా పరిశోధనలు జరిగాయి. దాని ఫలితంగా రూపొందిన ఆలుగడ్డ అన్ని విషయాల్లోనూ అద్భుతః అనిపిస్తున్నది.

Purple Aloo
కనిపించని ఆకలిని తీర్చేలా…
భారతదేశంలో ఆహారానికి లోటు లేకపోయినా… పోషకాహార లోపం మాత్రం ఎక్కువగానే ఉంది. ఇలా మనం కడుపు నిండా తిన్నా శరీరానికి కావలసిన పోషకాలు మాత్రం అందకపోవడాన్నే ‘హిడెన్ హంగర్’ అని పిలుస్తున్నారు శాస్త్రవేత్తలు. అదే కనిపించని ఆకలి అన్నమాట. దీన్ని రూపుమాపే ఉద్దేశంతో పుట్టుకొచ్చినవే ఈ పర్పుల్ పొటాటోలు. పైకి కనిపించే చెక్కు మాత్రమే కాదు, తరిగినా కూడా లోపల నిండు ఊదా రంగులో ఉండటం దీని ప్రత్యేకత. రెండేండ్ల క్రితం సృష్టించిన వీటి సాగును ఆయా కేంద్ర సంస్థలు సాగు కోసం ప్రోత్సహిస్తుండటంతో ఇవి ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇందులో విటమిన్ సి, ఆంథోసైనిన్లు, ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

P Aloo Dish

Dishes Aloo
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ఈ కుర్ఫీ జామూనియా రకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. గతంలో తయారు చేసిన ఊదా ఆలుగడ్డలు కుర్ఫీ నీలకంఠ్, కుర్ఫీ మాణిక్ రకాల కన్నా విటమిన్-సి, ఆంథోసైనిన్లు, యాంటి ఆక్సిడెంట్లు ఇందులో అధికం. గుండ్రంగా పొడుగ్గా ఉండే దుంపలుగా పెరిగే ఇవి హెక్టారుకు 32 నుంచి 35 టన్నుల వరకూ పండుతాయట. సంప్రదాయకంగా చేసే కూరలు, పులుసులతో పాటు పరాఠాలు, పొడుల తయారీకి కూడా వీటిని వినియోగించుకోవచ్చు. ఇలా పంటల్లో పోషకాలను జొప్పించడాన్ని ఫోర్టిఫికేషన్ అని పిలుస్తారు. ఉప్పు, బియ్యాలకు ఇంతకు ముందు ఈ ఫోర్టిఫికేషన్ జరిగినా తర్వాత ఆలుగడ్డలు ఆ వరుసలో వచ్చి చేరాయి. త్వరలో దీని పంట మరింత మందిని చేరనుందట. అప్పుడు మనమూ వండేయొచ్చు ఆరోగ్యాల ఆలూ..!

Kufri Jaminia
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

