తెలంగాణ ప్రబంధ పరిమళం
ఈ పద్యం దోమకొండ సంస్థానాధీశులు రాజా కామినేని మల్లారెడ్డి రచించిన షట్చక్రవర్తి చరిత్రము అనే కావ్యం మూడో ఆశ్వాసంలోనిది. ఇతను గోల్కొండ నవాబు ఇబ్రహీం కుతుబ్ షా సమకాలీనుడు.
పొద్దుపొడుపులో.. రేయి సద్దులు!
శా॥ ప్రాతఃకాలము నందు బూర్వహరి దభ్రంబొప్పె సంరక్త
జీమూత చ్ఛేదక వీటి కారసమునై, ముక్త ప్రభాసాంద్ర తా
రాతాంత ప్రసవం బునై, విరళచంద్రాం చత్పటీరాంశు సం
ఘాతంబై రజనీ సుధాకరుల రంగ త్కేళితల్పం బునన్
ఈ పద్యం దోమకొండ సంస్థానాధీశులు రాజా కామినేని మల్లారెడ్డి రచించిన షట్చక్రవర్తి చరిత్రము అనే కావ్యం మూడో ఆశ్వాసంలోనిది. ఇతను గోల్కొండ నవాబు ఇబ్రహీం కుతుబ్ షా సమకాలీనుడు. అతని పద్యంలో ప్రబంధ వర్ణనలు వినూత్న కల్పనలు సరళంగా అలవోకగా సాగుతాయి. ఈ శార్దూల పద్యం ప్రాతఃకాల వర్ణనకు సంబంధించిన అత్యంత శృంగార భరితమైన, రమణీయమైన ఉత్ప్రేక్షతో అలరిస్తుంది. ఉదయపు తూర్పు ఆకాశం ఎలా ఉందటా అంటే రాత్రి అనే కన్య చంద్రుడు అనే నాయకుడు రేయంతా జరిపిన విలాసవంతమైన క్రీడ తరువాత వారి కేళీతల్పంలాగా ఉందట. ఎందుకో చూద్దాం.
తూర్పు దిక్కున గల ఆకాశం (పూర్వ హరి దభ్రంబు) ఎర్రబడిన మేఘాల ముక్కలు (జీమూత ఛేదములు) తాంబూలం నమలగా వచ్చిన ఎర్రటి రసం చిందినట్లు (నాయికా నాయకులు తాంబూలం సేవించి ఉమ్మేసినట్లుగా తూర్పు ఆకాశం ఎర్రటి మేఘాలతో) ఉందట. కాంతిని కోల్పోయి వాడిపోయిన నక్షత్రాల విషయానికి వస్తే.. రాత్రి క్రీడలో నలిగిపోయి పాన్పుపై రాలిపోయిన తెల్లని పూల వలె ఉన్నాయట. కాంతి తగ్గుతున్న ఆ తెల్లని చంద్ర కిరణాల సమూహం ఆ పాన్పుపై చల్లిన తెల్లని చందనపు పూత వలె కనిపిస్తున్నదట. మొత్తంగా చెప్పాలంటే.. ఆ ఉదయపు ఆకాశం నాయికా నాయకుల కేళీతల్పంలాగా ఉన్నదట. ఇది శృంగార ఉత్ప్రేక్షలో కవి గావించిన వినూత్న కల్పన.
– చేపూరి శ్రీరాం, హన్మకొండ
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

