Suraksha QR | సంక్షోభ సమయాల్లో ఒక్క క్లిక్‌తో వైద్య రికార్డులను అందించే సురక్ష క్యూఆర్ యాప్
క్యూఆర్ కోడ్‌తో.. సకల ఆర్థిక సేవలూ సాధ్యం అయినప్పుడు.. అత్యవసర వైద్యాన్ని మాత్రం ఎందుకు అందించలేం? అనే ఆలోచనే విద్యాసాగర్ రెడ్డిని ‘సురక్ష క్యూఆర్ ’ ఏర్పాటు దిశగా అడుగులు వేయించింది. ఈ హైదరాబాదీ స్టార్టప్ ఆరేడు నెలల్లోనే వేలమందికి చేరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఆరంభమైన సేవలు దేశ రాజధాని ఢిల్లీ వరకూ విస్తరించనున్నాయి.
Suraksha QR | క్యూఆర్ కోడ్‌తో.. సకల ఆర్థిక సేవలూ సాధ్యం అయినప్పుడు.. అత్యవసర వైద్యాన్ని మాత్రం ఎందుకు అందించలేం? అనే ఆలోచనే విద్యాసాగర్ రెడ్డిని ‘సురక్ష క్యూఆర్ ’ ఏర్పాటు దిశగా అడుగులు వేయించింది. ఈ హైదరాబాదీ స్టార్టప్ ఆరేడు నెలల్లోనే వేలమందికి చేరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఆరంభమైన సేవలు దేశ రాజధాని ఢిల్లీ వరకూ విస్తరించనున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం.. రోజూ దాదాపు పన్నెండు వందల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో దాదాపు ఐదొందల మంది మరణిస్తున్నారు. ప్రతి గంటకూ యాభై ప్రమాదాలతో రహదారులు నెత్తురోడుతున్నాయి. ఆ దుర్ఘటనల్లో ఇరవై మంది ప్రాణం కోల్పోతున్నారు. సురక్ష క్యూఆర్ లాంటి సదుపాయాలతో అందులో సగానికి సగం జీవితాల్ని నిలబెట్టవచ్చు.
ఓఆలయం దగ్గర చాలామంది యాచకులు ఉంటారు. వరుసగా నిలబడి ‘అమ్మా ధర్మం’ అని వేడుకుంటూ ఉంటారు. ఇచ్చేవాళ్లు దయతో ఇస్తుంటారు. ఇవ్వనివాళ్లు ‘చిల్లర లేదు’ అని విసుగ్గా చెబుతుంటారు. చివరన నిలబడిన ఓ యాచకుడి దగ్గర మాత్రం ఆ పప్పులు ఉడకవు. ఎందుకంటే, అతని బొచ్చెకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ మధ్య ఏదో పత్రికలో ఇదే ఇతివృత్తంతో ఓ కార్టూన్ వచ్చింది. ఈ వ్యంగ్య చిత్రం వెనుక ఓ సీరియస్ విషయం ఉంది. క్యూఆర్ కోడ్ మన జీవితాల్లోకి చొచ్చుకొస్తున్న క్రమం ఉంది. నిజమే, క్యూఆర్ కోడ్‌తో ఎంతో వెసులుబాటు. పాస్‌వర్డ్‌తో పన్లేదు. ఎటూ చేతిలో సెల్‌ఫోన్ ఉంటుంది. చిటికెలో స్కాన్ చేసుకోవచ్చు. ఈ సౌలభ్యాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఎందుకు వాడుకోకూడదు? ఓ హైదరాబాదీ ఆంత్రప్రెన్యూర్ కూడా ఇలానే ఆలోచించాడు. ‘సురక్ష క్యూఆర్’ అనే వేదికను స్థాపించాడు.
తీవ్రరోడ్డు ప్రమాదం జరుగుతుంది. బాధితులు రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు. అసలే కొత్త ప్రదేశం. దగ్గర్లోని దవాఖానల గురించి తెలియదు. అంబులెన్స్‌ను ఎలా రప్పించాలో తెలియదు. ఆ టెన్షన్లో హెల్ప్‌లైన్ నంబర్లు కూడా గుర్తుకురావు. ఫలితంగా క్షతగాత్రులకు చికిత్స ఆలస్యం అవుతుంది. పరిస్థితి మరింత విషమంగా తయారవుతుంది. ఇలాంటి సంక్షోభ సమయాల్లో ఒక్క క్లిక్‌తో వైద్య రికార్డులను అందించే సాంకేతికతను రూపొందించారు ‘సురక్ష క్యూఆర్’ వ్యవస్థాపకుడు విద్యాసాగర్ రెడ్డి. తనుకు ఫ్రెష్వర్క్లాంటి సంస్థలలో పనిచేసిన అనుభవం ఉంది. కొన్ని స్టార్టప్స్‌కూ ప్రాణంపోశారు. ప్రధాన నగరాల్లో వివిధ బ్రాండ్స్ ఎలక్ట్రానిక్ వాహనాలు విక్రయించే షోరూమ్‌లను నిర్వహిస్తున్నారు.
ఒక్క క్లిక్ చాలు
సురక్ష క్యూఆర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు. అత్యవసర పరిస్థితుల్లో ఆ వ్యక్తి కానీ, అతని సంరక్షకుడు కానీ అందులోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే.. దగ్గర్లోని అంబులెన్స్‌కు, ఆత్మీయుల ఫోన్ నంబర్‌కు సమాచారం వెళ్తుంది. హాస్పిటల్‌కు చేరుకోగానే.. ఎమర్జెన్సీ వార్డు వైద్యులు బ్లడ్‌గ్రూప్ కోసం మళ్లీ అన్ని పరీక్షలు చేయించాల్సిన పన్లేదు. యాప్‌లో రోగి ఆరోగ్యచరిత్ర మొత్తం ఉంటుంది. దీంతో నిపుణులు ‘గోల్డెన్ అవర్’ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రాణాలు నిలబెట్టడం మీదే దృష్టిపెట్టొచ్చు. అంతేకాదు, యాప్‌లోనే ఆరోగ్యబీమాకు సంబంధించిన వివరాలూ ఉంటాయి. హాస్పిటల్ బిల్లుల విషయంలో ఇబ్బంది పడాల్సిన పనేలేదు. ‘ఆసుపత్రిపాలైన ప్రతిసారీ మా సభ్యులకు లక్ష రూపాయల వరకూ ప్రమాదబీమా, ఐదువేల రూపాయల వరకూ అంబులెన్స్ ఖర్చులు ఉచితంగా అందిస్తాం’ అని చెబుతారు విద్యాసాగర్. ఆరున్నర వేల మంది వైద్యులతో ఆన్లైన్ కన్సల్టెన్సీ సదుపాయమూ ఉంది. రోగ నిర్ధారణ పరీక్షలలో డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. నిత్యావసర మందులను హోమ్ డెలివరీ చేస్తారు. సురక్ష క్యూఆర్ఈ ఏడాది మార్చిలో సేవలను ప్రారంభించింది . ఇప్పటికే ముప్పైవేలమంది సభ్యత్వం తీసుకున్నారు. ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఐదులక్షల సభ్యత్వాలు తమ లక్ష్యమని చెబుతారు విద్యాసాగర్. ఏపీ, తెలంగాణ సహా అనేక రాష్ర్టాలకు విస్తరించిందీ సంస్థ. ఢిల్లీ సహా మరికొన్ని ప్రాంతాల్లో సేవలు ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ‘ప్రతి క్షణం విలువైనదే’ ఈ సంస్థ నినాదం. మూడు క్యూఆర్ కోడ్ స్టికర్స్ ఇస్తారు కాబట్టి.. కారు, బైక్, హెల్మెట్ ఎక్కడైనా అతికించుకోవచ్చు. కాకపోతే, ఈ సేవలకు నిర్ణీత మొత్తం చార్జ్ చేస్తారు.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పీటీ స్వామి సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలవాలి.. గోదావరిఖనిలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం: హరీశ్‌రావు
Sensational Decision | వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఓటు వేయకుండానే వెనుతిరిగిన మాజీ సీఎం
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ ‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్ విడుదల.. ఈ చిత్రంతో ఆసక్తికరమైన సంకేతాలు!
IND vs NZ | శ్రేయస్, ఇషాన్ హాఫ్ సెంచరీలు .. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..!
Cop Arrested For Raping Woman | పోలీస్ స్టేషన్లో మహిళపై అత్యాచారం.. కానిస్టేబుల్ అరెస్ట్, మరో ఐదుగురు సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

