బయట విజయం.. లోపల భయం
ఇంపోస్టర్ సిండ్రోమ్ ఒక రకమైన మానసిక ఒత్తిడి. ఇందులో బాధితులు తమ విజయాలకు తమ కష్టాన్ని కారణం అనుకోకుండా, కేవలం అదృష్టం కొద్దీ లేదా ఏదోలా బయటపడిపోయామని భావిస్తారు. ఎంతటి ప్రతిభావంతులైనప్పటికీ, తాము ఒక రోజు నలుగురి ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందనే భయం వారిని నిత్యం వెంటాడుతూ ఉంటుంది.
మన్తరంగం
సీన్ – 1
రమేష్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఎంతో కష్టపడితే పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ ఆనందానికి బదులుగా రమేష్‌కు విపరీతమైన భయం పట్టుకుంది. ‘నేను ఈ ఉద్యోగానికి అర్హుడిని కాను. ఇంటర్వ్యూలో ఏదో మేనేజ్ చేసి సెలెక్ట్ అయ్యాను. నాలో అంత టాలెంట్ లేదు. రేపు ఆఫీసులో నా గురించి అందరికీ తెలిసిపోతుంది, నా పరువు పోతుంది’ అని అతనిలో నిరంతరం ఆందోళన. ఫలితంగా, ప్రతి చిన్న పనిలోనూ తప్పులు దొర్లుతాయనే భయంతో విపరీతంగా శ్రమించి ఒత్తిడికి గురవుతున్నాడు.
సీన్ – 2
రాధ.. తరగతిలో ప్రతిసారీ మొదటి స్థానం ఆమెదే! కానీ తన మనసులో మాత్రం అభద్రతాభావం. ‘ఈసారి పరీక్షలో కచ్చితంగా ఫెయిల్ అవుతాను, అందరి ముందు నా పరువు పోతుంది. గతంలో వచ్చిన మంచి మార్కులన్నీ కేవలం అదృష్టం కొద్దే వచ్చాయి’ అని తన విజయాలను తక్కువ చేసుకుంటూ ఉంటుంది.
రమేష్, రాధ మాదిరిగా బయటికి విజయవంతంగా కనిపిస్తూ, లోపల మాత్రం తమ ప్రతిభను తామే నమ్మలేక సతమతమయ్యే ఈ మానసిక స్థితిని ‘ఇంపోస్టర్ సిండ్రోమ్’ అంటారు.
ఇంపోస్టర్ సిండ్రోమ్ ఒక రకమైన మానసిక ఒత్తిడి. ఇందులో బాధితులు తమ విజయాలకు తమ కష్టాన్ని కారణం అనుకోకుండా, కేవలం అదృష్టం కొద్దీ లేదా ఏదోలా బయటపడిపోయామని భావిస్తారు. ఎంతటి ప్రతిభావంతులైనప్పటికీ, తాము ఒక రోజు నలుగురి ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందనే భయం వారిని నిత్యం వెంటాడుతూ ఉంటుంది.
లక్షణాలు ఇవే..
విజయాలను తక్కువ చేసి మాట్లాడటం: ‘లక్ బాగుండి అలా జరిగిపోయింది’ అని క్రెడిట్ అంతా అదృష్టానికి ఆపాదించడం.
పరిపూర్ణత కోసం పాకులాడటం: ప్రతి పనీ నూటికి నూరు శాతం కచ్చితంగా ఉండాలని కోరుకోవడం, చిన్న తప్పు జరిగినా తనను తాను క్షమించుకోలేకపోవడం.
ఎల్లప్పుడూ ఆందోళన: ఎక్కడ తన నిజస్వరూపం (ఎలాంటి లోపం లేకపోయినా) బయటపడుతుందోననే నిరంతర భయం.
ఎందుకు ఇలా..
ఇంపోస్టర్ సిండ్రోమ్ కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు. ఇది మెదడులోని కొన్ని భాగాలు, హార్మోన్లు, నాడీ వ్యవస్థ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఎంతటి ప్రతిభావంతులైనప్పటికీ, తమను తాము తక్కువగా అంచనా వేసుకోవడానికి, ఎల్లప్పుడూ ఏదో ఒక ప్రమాదం ముంచుకొస్తున్నట్లు భావించడానికి మన మెదడులోని జీవసంబంధమైన కారణాలేమిటో తెలుసుకుందాం.
అమిగ్డాలా అతిగా స్పందించడం
మన మెదడులో భావోద్వేగాలను, ముఖ్యంగా భయాన్ని నియంత్రించే కేంద్రం ‘అమిగ్డాలా’. ఇంపోస్టర్ సిండ్రోమ్‌తో బాధపడేవారిలో ఈ అమిగ్డాలా అత్యంత సున్నితంగా ఉంటుంది. కార్యాలయంలో ఒక చిన్న సమావేశం జరిగినా, లేదా బాస్ నుంచి ఒక చిన్న ఫీడ్‌బ్యాక్ వచ్చినా.. ఆ అమిగ్డాలా వెంటనే దానిని ఒక పెద్ద ప్రమాదంగా హెచ్చరిస్తుంది. ఫలితంగా, మెదడులో ‘ఫైట్ ఆర్ ఫ్లయిట్’ స్పందన మొదలై, ఒత్తిడి హార్మోన్లు కార్టిసాల్, అడ్రినాలిన్ విడుదలవుతాయి. దీనివల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం వంటి శారీరక లక్షణాలు కనిపిస్తాయి.
ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్, అమిగ్డాలా మధ్య అసమతుల్యత
మెదడులో ఆలోచించడం, తార్కికంగా విశ్లేషించడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులను ‘ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్’ చూసుకుంటుంది. సాధారణంగా ఆరోగ్యకరమైన మెదడులో, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అమిగ్డాలా ఇచ్చే అనవసరమైన భయాలను అదుపులో ఉంచుతుంది. ఇంపోస్టర్ సిండ్రోమ్ ఉన్నవారిలో ఈ రెండు భాగాల మధ్య అనుసంధానం బలహీనపడుతుంది. భయాన్ని కలిగించే అమిగ్డాలా సిగ్నల్స్ బలంగా మారి, వాటిని హేతుబద్ధంగా ఆలోచించి కొట్టిపారేసే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ శక్తి తాత్కాలికంగా తగ్గిపోతుంది.
డోపమైన్, రివార్డ్ సిస్టమ్ లోపం
మనకు ప్రశంసలు దక్కినప్పుడు లేదా విజయం సాధించినప్పుడు మెదడులోని ‘డోపమైన్’ అనే హార్మోన్ విడుదలై మనకు ఆనందాన్ని, తృప్తిని ఇస్తుంది. ఇంపోస్టర్ సిండ్రోమ్ ఉన్నవారి మెదడు ఈ విజయాన్ని ఒక శాశ్వత రివార్డ్‌గా స్వీకరించదు. వారు విజయం సాధించిన క్షణంలో డోపమైన్ విడుదలైనప్పటికీ, వారి మెదడులోని ఆలోచనా విధానం దానిని ‘ఇది తాత్కాలికం, అదృష్టం కొద్దీ వచ్చింది’ అని తక్కువ చేసి చూస్తుంది. తద్వారా ఆ విజయపు ఆనందం మెదడులో ఎక్కువ కాలం నిలవదు.
నెగెటివ్ బయాస్, న్యూరోప్లాస్టిసిటీ
మానవ పరిణామ క్రమంలో ప్రమాదాలను ముందుగా గుర్తించడానికి మెదడు నెగెటివ్ విషయాలను ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునేలా రూపుదిద్దుకుంది. పది మంది పొగిడినా, ఒకరు చిన్న విమర్శ చేసినా ఇంపోస్టర్ సిండ్రోమ్ ఉన్నవారి మెదడు ఆ ఒక్క విమర్శనే పదేపదే గుర్తుచేసుకుంటూ న్యూరల్ పాత్‌వేస్‌ను బలపరుచుకుంటుంది. కాలక్రమేణా ‘నేను అనర్హుడిని’ అనే ఆలోచన మెదడులో బలంగా నాటుకు పోతుంది.
ఎలా అధిగమించాలి?
మన మెదడుకు ఉన్న అద్భుతమైన గుణం ‘న్యూరో ప్లాస్టిసిటీ’. అంటే, మనం చేసే కొత్త అభ్యాసాల ద్వారా మెదడులో కొత్త నాడీ మార్గాలను ఏర్పరచుకోవచ్చు. ధ్యానం వల్ల అతిగా స్పందించే అమిగ్డాలా శాంతిస్తుంది. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ శక్తి పుంజుకుంటుంది.
మన విజయాలను రాతపూర్వకంగా రాసుకోవడం ద్వారా మెదడుకు అది కేవలం ‘అదృష్టం’ కాదని, మీ కష్టార్జితం అని సంకేతాలు పంపవచ్చు. ఎవరూ పరిపూర్ణులు కాదు. తప్పులు చేయడం ద్వారానే మనుషులు ఎదుగుతారు అనే సత్యాన్ని అంగీకరించండి.
ఎంతోమంది ప్రముఖులు ఈ సిండ్రోమ్‌ను ఎదుర్కొన్నవారే అని తెలిస్తే మీకు మానసిక ఊరట లభిస్తుంది.
బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

