మెహ్రీన్ బయటకెళ్తే హ్యండ్‌బ్యాగ్‌లో ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందేనట !!
Mehreen Kaur Pirzada | మెహ్రీన్ ఫిర్జాదా.. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘హనీ ఈజ్ ద రిచ్’ అని వయ్యారాలుపోతూ మరోసారి మనందరి మనసుల్నీ దోచేసింది. సెంటిమెంట్, కామెడీ.. పాత్ర ఏదైనా ‘ద బెస్ట్’ ఇవ్వడమే తన పని అంటున్నది. తన అభిరుచులు, ఆలోచనల గురించి ఈ పంజాబీ భామ పంచుకున్న ముచ్చట్లు..
డ్రీమ్‌రోల్?
‘మహానటి’ సినిమాలో కీర్తి సురేశ్‌లా తిరుగులేని పాత్ర చేయాలి.
డ్రీమ్ డైరెక్టర్?
సంజయ్ లీలా భన్సాలీతో ఒక్క సినిమా అయినా చేయాలనేది నా కల.
ఇష్టమైన న టీనటులు?
కాజోల్, ఇర్ఫాన్‌ఖాన్
నచ్చని విషయం?
సమయపాలన లేకపోవడం. ఎప్పుడూ లేటే!

హ్యండ్‌బ్యాగ్‌లో తప్పనిసరిగా ఉండేవి?
శానిటైజర్, లిప్‌బామ్, పర్ఫ్యూమ్
యోగా/ జిమ్.. రెండిట్లో మీ ఓటు?
జిమ్
ఇండియన్ ఫుడ్/ గ్లోబల్ ఫుడ్?
ఇండియనే. అదీ ఇంటి భోజనమైతే మరీ ఇష్టం.
క్లోజ్ ఫ్రెండ్?
నా స్కూల్‌మేట్ తమన్నా.
బీచ్, హిల్ స్టేషన్స్.. దేన్ని ఇష్టపడతారు?
కొండపైనుంచి బీచ్ చూడటం.
శాకాహారం/ మాంసాహారం?
శాకాహారానికే మొదటి ప్రాధాన్యం.
పేరు, డబ్బు.. దేనికి మీ ఓటు?
పేరుంటే డబ్బు అదే వస్తుంది. కానీ డబ్బుతో పేరును కొనుక్కోలేం.

ఇండియన్ వేర్/ వెస్ట్రన్ వేర్?
రెండూ ఇష్టమే.
ఇటీవల చూసిన సినిమా/ వెబ్‌సిరీస్?
మాయి(Maai).
మీ దృష్టిలో సోషల్ మీడియా?
అభిమానులకు దగ్గరగా ఉండేందుకు వీలు కల్పించే సాధనం.
ప్రేమ?
ప్రేమ, స్నేహం ఒక్కటే. మీరు ప్రేమించే వ్యక్తి మీ బెస్ట్‌ఫ్రెండ్ అయినప్పుడే సరిగ్గా అర్థం చేసుకుంటారు.

కాబోయే జీవిత భాగస్వామిలో ఉండాల్సిన మూడు గుణాలు?
అర్థం చేసుకోగలిగే మనస్తత్వం, నమ్మకం, ప్రేమ.
డేట్‌కి వెళ్లాలంటే?
అది ఇద్దరి ఇష్టంతో ముడిపడి ఉంటుంది. ఇద్దరూ ఇష్టపడి ఎక్కడికెళ్లినా అది పర్ఫెక్ట్ డేటే అవుతుంది. సినిమా అయినా, డిన్నర్ అయినా..
ఫస్ట్‌లవ్?
సల్మాన్ ఖాన్.
స్ట్రెయిట్ హెయిర్/ ఉంగరాల జుట్టు?
నిజానికి నాది స్ట్రెయిట్ హెయిర్. సినిమాల కోసం కర్ల్స్ చేయిస్తా. షూటింగ్స్ లేకపోతే స్ట్రెయిట్ హెయిర్‌తోనే ఉంటా.
మాస్క్ పెట్టుకుని బయటికి వెళ్తారా.. ఇంట్లోనే ఉంటారా?
మాస్క్ పెట్టుకుని బయటికి వెళ్తా. అదే సమయంలో నావల్ల ఎవరికీ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటా.

బాగా గుర్తుండిపోయిన సంఘటన?
అమ్మ నన్ను, అన్నయ్యను పెంచేందుకు కష్టపడిన రోజులు. అమ్మ నిజంగా చాలా ధైర్యవంతురాలు.
ఎదుటి వ్యక్తిలో ముందుగా గమనించేది?
నన్ను ఎలా చూస్తున్నారనేదాన్ని బట్టి, అవతలి వాళ్ల ఆలోచనేంటో తెలుస్తుంది.
మిమ్మల్ని అందంగా చూపించేది?
నా చర్మం. మనల్ని మనం ఇష్టపడినప్పుడే సంతోషంగా జీవించగలుగుతాం.
రాజకీయాలు, ఆటలు, వినోదం, వ్యాపారం.. ఏదో ఒకటి ఎంచుకోమంటే?
వినోదం.
Read More :
“Mehreen Pirzada | హాఫ్ శారీలో మెహ్రీన్ పిర్జాదా మెరుపులు..”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

