సీతాకోక చిలుక ఫలితం

మనిషి పుట్టుక పరమార్థాన్ని తెలియజేసే ప్రయాణమే జీవితం. ఒక చిన్న మార్పు లేదా సంఘటన వల్ల తర్వాత దశల్లో భారీ మార్పులు చోటు చేసుకోవడాన్ని ‘సీతాకోక చిలుక ఫలితం’ (బటర్ ఫ్లై ఎఫెక్ట్) అంటారు. ఎదుగుతున్న తొలినాళ్లలోనే మనిషి చిన్నచిన్న ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే తర్వాత కాలంలో జీవితం గొప్పగా సాగిపోతుంది. కష్టాలను తట్టుకొనే శక్తి వస్తుంది. లేకపోతే అధఃపాతాళానికి కూరుకుపోతుంది. ఈ విషయాన్ని
‘వటవృక్షం ఒడిలో వన్నెల సీతాకోకచిలుక’ పేరుతో అతిచిన్న పుస్తకంలో, సరళమైన భాషలో, సుబోధకంగా వివరించారు పద్మజ పెన్మెత్స. ఈ సందేశాన్ని అందజేయడానికి గొంగడిపురుగు దశ నుంచి సీతాకోక చిలుకగా పరివర్తన చెందుతున్న నవ్య అనే పాత్రను సృష్టించారు రచయిత్రి. దాని పెరుగుదల క్రమంలో మార్గనిర్దేశం చేసే ‘ఝరి’ అనే మర్రిచెట్టు, కష్టం విలువను గుర్తుచేసే చీమలు, ఎదుటివాళ్లను అర్థం చేసుకోవాలని చెప్పే పావురాల జంట, ఓర్పు విలువను తెలియజేసే ఉడుత పాత్రల ద్వారా జీవిత ప్రయాణం ఎలా సాగాలో ఈ చిరు పుస్తకంలో చక్కగా వర్ణించారు. ఎవరి జీవితాలను వారు ఫలవంతం చేసుకోవడానికి రచయిత్రి సూచించిన తేలికైన మార్గమే ఈ పుస్తకం.
వటవృక్షం ఒడిలో
వన్నెల సీతాకోక చిలుక
పేజీలు : 95, వెల: 350,
రచన: పద్మజ పెన్మెత్స
ప్రతులకు: నోషన్ప్రెస్.కామ్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Novel books
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

