ధర: 1,399 దొరుచుచోటు: అమెజాన్
నగరాలు, పట్టణాల్లో సరఫరా అయ్యే నీటిలో క్లోరిన్ అధికంగా ఉంటుంది. ఈ నీటిని వాడటం వల్ల జుట్టు రాలడం, చర్మం పొడిబారడం లాంటి మరెన్నో సమస్యలు చుట్టుముడతాయి. వీటికి HealthSense Hard Water Softener Filter సమర్థంగా చెక్ పెడుతుంది. ట్యాప్‌కి తగించుకునే ఈ చిన్న ఫిల్టర్.. నీటిలోని క్లోరిన్, పైపుల నుంచి వచ్చే తుప్పు, ఇతర మలినాలను అడ్డుకుంటుంది. ఈ ఫిల్టర్‌లో మల్టీ-స్టేజ్ ఫిల్టరేషన్ పద్ధతి ఉంటుంది. ఇందులోని కేడీఎఫ్-55 ఫిల్టర్.. క్లోరిన్, ఇతర భార లోహాలను తొలగిస్తుంది. యాక్టివేటెడ్ కార్బన్.. నీటిలోని దుర్వాసనను, రంగును పోగొడుతుంది. క్యాల్షియం సల్ఫేట్.. వేడి నీటిలోనూ క్లోరిన్‌ను సమర్థవంతంగా తొలగించడానికి సహాయపడుతుంది. నీటి వినియోగం, హార్డ్నెస్ను బట్టి ప్రతి మూడు నుంచి ఆరు నెలలకు ఒకసారి లోపల ఉండే ఫిల్టర్ క్యార్ట్రిడ్జ్ను మార్చాల్సి ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ. ట్యాప్ దగ్గర ఫిల్టర్‌గా, షవర్ అటాచ్మెంట్గా వాడుకోవచ్చు.
ధర: రూ. 938 దొరుచుచోటు : అమెజాన్
పసిపిల్లల పాలను సరైన ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే, పాలను మరీ వేడిచేస్తే.. అందులోని పోషకాలు నశిస్తాయి. బిడ్డకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇక పిల్లలతో ప్రయాణాలు చేస్తున్నప్పుడు పాలను వేడిగా ఉంచడం కూడా ముఖ్యమే! ఈ సమస్యలకు Portable Warmer Bottle అద్భుతమైన పరిష్కారం చూపుతుంది.

ఈ పోర్టబుల్ మిల్క్ వార్మర్.. బ్యాటరీ, పవర్ బ్యాంక్‌తో పనిచేస్తుంది. ఇది పాలను అంతటా సమానంగా వేడి చేస్తుంది. పాలలోని యాంటి బాడీస్, పోషకాలను కాపాడుతుంది. ఇందులో ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ ఉంటుంది. నిర్దేశించిన ఉష్ణోగ్రతకు చేరుకున్నప్పుడు దానంతట అదే.. వేడి చేయడాన్ని నిలిపేస్తుంది. ఏబీఎస్ మెటీరియల్‌తో తయారైన ఈ బేబీ మిల్క్ వార్మర్.. పిల్లల ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది.
రూ.4,500 దొరుకుచోటు: trozk.com
అన్నిట్లో కొత్తదనాన్ని కోరుకునే నవతరానికి.. రెగ్యులర్ పవర్ బ్యాంక్స్ బోర్ కొడుతున్నాయి. అందుకే, అవి కూడా వినూత్నంగా, స్టయిలిష్‌గా తయారవుతున్నాయి. అలాంటిదే.. Trozk Beeper Power Bank. ఇది 90ల నాటి పేజర్/ బీపర్ డిజైన్‌తో.. చూసేందుకు విభిన్నంగా కనిపిస్తుంది. పాతకాలపు నోస్టాల్జియా లుక్‌తోపాటు ఆధునిక చార్జింగ్ టెక్నాలజీనీ అందిస్తుంది.

దీనిపై ఉండే చిన్న స్క్రీన్ బ్యాటరీ శాతాన్ని మాత్రమే కాకుండా.. రెట్రో స్టయిల్ యానిమేషన్లు, మెసేజ్‌లను కూడా చూపిస్తుంది. 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. 30W వరకు ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఒక యూఎస్బీ-సీ, ఒక యూఎస్బీ-ఏ పోర్ట్ ఉన్నాయి. దాంతో ఒకేసారి రెండు పరికరాలను చార్జ్ చేసుకోవచ్చు.
ధర: రూ. 2,799 (64జీబీ పెన్‌డ్రైవ్) దొరుకుచోటు : అమెజాన్
పిల్లల పాఠశాల ప్రాజెక్టులు, హోంవర్క్, వారి డ్రాయింగ్స్ సేవ్ చేసుకోవడానికి ఓ మంచి ఫ్లాష్‌డ్రైవ్ కోసం చూస్తున్నారా? అయితే, SANDISK Crayola USB Type-C పెన్‌డ్రైవ్‌పై ఓ లుక్కేయండి. ప్రఖ్యాత సాన్‌డిస్క్ సంస్థ, క్రయోలా క్రేయాన్స్‌తో కలిసి ఈ ప్రత్యేకమైన స్టోరేజీ డివైజ్‌ని రూపొందించింది. డిజిటల్ స్టోరేజీకి పిల్లల సృజనాత్మకతను యాడ్ చేసింది. ఈ పెన్‌డ్రైవ్ చూసేందుకు క్రయోలా క్రేయాన్స్లాగే కనిపిస్తుంది. క్యాప్ తీస్తే.. లోపల యూఎస్బీ కనెక్టర్ ఉంటుంది. విండోస్, మ్యాక్ అన్ని ఓఎస్‌లలో పనిచేస్తుంది.

సిలికాన్, సాఫ్ట్‌టచ్ ప్లాస్టిక్‌తో తయారైన ఈ పెన్‌డ్రైవ్.. పిల్లలు పట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. వీటిని పిల్లల కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేశారు. 4జీబీ మొదలుకొని 256 జీబీ సామర్థ్యంతో ఈ ఫ్లాష్డ్రైవ్లు లభిస్తున్నాయి. సాధారణంగా క్రయోలా క్రేయాన్ల మాదిరిగానే.. వివిధ రంగులలో అందుబాటులో ఉన్నాయి. పుట్టిన రోజు వేడుకల్లో, స్కూల్ ప్రైజ్‌లుగా ఇవ్వడానికీ బాగుంటాయి. విభిన్నమైన, వింతైన ఆకారాల్లో ఉండే యూఎస్బీ డ్రైవ్‌లను ఇష్టపడే వారికి ఇవి మంచి చాయిస్.