వంట చేసేటప్పుడు పట్టుకోవడానికి కొన్ని గిన్నెలకు హ్యాండిల్స్ ఉండవు, మరికొన్నిటికి ఉన్నా.. అవి వేడెక్కి ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా వేడివేడి గిన్నెలను పొయ్యి మీదినుంచి దించడానికి ఇనుప పట్టుకార్లు వాడుతుంటారు. కానీ, ఒక్కోసారి అవి జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ కష్టాలకు చెక్ పెడుతూ, ఏ గిన్నెకైనా ఇట్టే అమరిపోయేలా.. Universal Pot Handle వచ్చేసింది. ఇదో ఒక మ్యాజిక్ హ్యాండిల్ లాంటిది. మీ ఇంట్లో ఉన్న పాన్లు, బాండీలు, బేకింగ్ ట్రేలు.. ఇలా దేనికైనా దీన్ని ఒక్క క్లిక్‌తో తగిలించేయొచ్చు. స్టవ్ మీద వంట పూర్తయ్యాక, అదే గిన్నెను హ్యాండిల్‌తో పట్టుకుని నేరుగా డైనింగ్ టేబుల్ మీద పెట్టేయొచ్చు. స్టెయిన్లెస్ స్టీల్, సిలికాన్‌తో తయారైన ఈ హ్యాండిల్.. ఏకంగా 10 కిలోల బరువును కూడా మోయగలదు. దీనిలోపల ఉండే రబ్బరు గ్రిప్ వల్ల గిన్నెలు అస్సలు జారవు, పట్టుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. వంట చేసేటప్పుడు చేతికి వేడి తగలనివ్వదు. గృహిణులకు వంట పనిని సులభతరం చేసే ఈ గ్యాడ్జెట్ ప్రతి కిచెన్‌లో ఉండాల్సిందే!
స్నానం చేశాక జుట్టును ఆరబెట్టుకోడానికి Cortina వారి మైక్రోఫైబర్ హెయిర్ టవల్ క్యాప్ వచ్చేసింది. ఇదో సాధారణ టవల్లాగా కాకుండా క్యాప్ ఆకారంలో ఉంటుంది. మైక్రోఫైబర్ మెటీరియల్‌తో తయారైన ఈ క్యాప్.. నీటిని పూర్తిగా పీల్చుకుంటుంది. స్నానం చేసిన వెంటనే దీన్ని తలకు టోపీలా పెట్టుకుంటే చాలు, జుట్టులోని తడిని ఇట్టే పీల్చేస్తుంది. దీంతో జుట్టు చాలా వేగంగా ఆరుతుంది.

ముఖ్యంగా రింగుల జుట్టు ఉన్నవారికి ఇదో వరం లాంటిది. జుట్టును రుద్దాల్సిన అవసరం లేకుండానే ఆరబెడుతుంది. దీంతో వెంట్రుకలు చిక్కు పడవు. జుట్టు రాలడం తగ్గుతుంది. ఇంట్లో పనులు చేసుకుంటున్నప్పుడు, మేకప్ వేసుకుంటున్నప్పుడు తలకు తగిలించుకోవచ్చు. జిమ్, యోగా, ప్రయాణాలకు వెళ్లినప్పుడు బ్యాగులో తీసుకెళ్లడం చాలా సులభం. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ స్మార్ట్‌గా ఆరబెట్టుకోవాలనుకునే వారికి ఇదో పర్ఫెక్ట్ హెయిర్ కేర్ గ్యాడ్జెట్.
ఫ్యామిలీ గెట్-టుగెదర్, స్నేహితుల బర్త్‌డే పార్టీ అయానా పాటలు లేకుంటే మజాయే ఉండదు. కానీ, పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్, వైర్ల గందరగోళంతో పార్టీ మూడ్ కాస్తా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఈ తలనొప్పి లేకుండా, మీరు వెళ్లే ప్రతిచోటూ ఒక చిన్నపాటి ‘కరోకే క్లబ్’లా మారిపోయేలా Wembley మినీ కరోకే మెషిన్ వచ్చేసింది. ఇది అరచేతిలో ఇమిడిపోయేంత చిన్నగా ఉన్నా, దీని నుంచి వచ్చే సౌండ్ మాత్రం అదిరిపోతుంది. ఇదో పవర్ఫుల్ బ్లూటూత్ స్పీకర్, వైర్లెస్ మైక్‌ల కాంబినేషన్. దీని ప్రత్యేకత ఏమిటంటే.. దీంట్లో ఉన్న ఐదు రకాల వాయిస్ మోడ్స్.

మీరు పాడుతున్నప్పుడు మీ గొంతును ఆడవారిలాగా, మగవారిలాగా, చిన్న పిల్లల్లాగా, రాక్షసుడిలా మార్చేసి.. అందరినీ నవ్వించవచ్చు. ఇందులో 2000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటంతో ఒక్కసారి చార్జ్ చేస్తే 3 నుంచి 4 గంటలపాటు నాన్‌స్టాప్‌గా పాటలు పాడుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా ఫోన్‌కి కనెక్ట్ చేయడమే కాకుండా.. పెన్‌డ్రైవ్, మెమరీ కార్డ్ ద్వారా కూడా మీకు ఇష్టమైన పాటలను ప్లే చేసుకోవచ్చు.
వంట చేసేటప్పుడు ఉప్పు, కారం, పసుపు, మసాలా దినుసులు.. ఇలా ఒక్కో డబ్బా కోసం వెతుక్కోవడం పెద్ద తలనొప్పి. ఒక్కోసారి ఆ హడావుడిలో గిన్నెలు పడిపోవడం, చేతులు తగిలి కారం ఒలికిపోవడం వంటివి సహజం. ఈ తలనొప్పి లేకుండా మీ వంటగదిని చాలా పద్ధతిగా, స్టయిలిష్‌గా మార్చేయడానికి Solimo రివాల్వింగ్ స్పైస్ ర్యాక్ సెట్ వచ్చేసింది. ఇది కిచెన్ ప్లాట్‌ఫాం మీద ఉంటే, ఒక చిన్నపాటి మసాలా ప్రపంచమే ఉందనుకోవచ్చు. అదీ మీ చేతికి అందేంత దగ్గరలో! దీంట్లో మొత్తం 16 జార్లు ఉంటాయి.

ఒక్కో దానిలో వంద గ్రాముల వరకు దినుసులు నింపుకోవచ్చు. దీని ప్రత్యేకత ఏమిటంటే… దీన్ని తిప్చొచ్చు. మెల్లిగా తిప్పితే చాలు.. మీకు కావాల్సిన డబ్బా ముందుకు వస్తుంది. ఫుడ్ గ్రేడ్ బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్‌తో తయారైన ఈ జార్లలో.. మూడు రకాల రంధ్రాలు ఉండే మూతలు ఉంటాయి. దీంతో మీకు కావాల్సినంత మోతాదులో దినుసులను చల్లుకోవచ్చు. గాలి చొరబడని మూతలు ఉండటంతో మసాలాల వాసన బయటికి పోకుండా, ఎప్పుడూ తాజాగా ఉంటాయి. దీనిని శుభ్రం చేయడం కూడా సులభం. ఈ జార్లను డిష్వాషర్లోనూ కడుక్కోవచ్చు. క్రమపద్ధతిలో అన్నీ ఒకేచోట ఉండటం వల్ల వంట పని మరింత వేగంగా పూర్తవుతుంది.