సంపూర్ణ మూర్తి ..సమగ్ర చరిత్ర
అపర చాణక్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీమూర్తి, ఆర్థశాస్త్ర మేధావి ఇలా ఒక్కొక్కరికీ ఒక్కోలా కనిపిస్తాడు మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ తేజం పీవీ నరసింహారావు. అందరినీ ఇంతలా ఆశ్చర్యపరిచిన పీవీ మూర్తిత్వానికి పునాదులు ఎక్కడ ఉన్నాయి? ఆయన వ్యక్తిత్వ నిర్మాణ మూలాలు ఎక్కడినుంచి మొదలయ్యాయి? సాధారణంగా ఒక మనిషి జీవితంలో ఒకట్రెండు మేలి మలుపులు ఉంటాయి.
అపర చాణక్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీమూర్తి, ఆర్థశాస్త్ర మేధావి ఇలా ఒక్కొక్కరికీ ఒక్కోలా కనిపిస్తాడు మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ తేజం పీవీ నరసింహారావు. అందరినీ ఇంతలా ఆశ్చర్యపరిచిన పీవీ మూర్తిత్వానికి పునాదులు ఎక్కడ ఉన్నాయి? ఆయన వ్యక్తిత్వ నిర్మాణ మూలాలు ఎక్కడినుంచి మొదలయ్యాయి? సాధారణంగా ఒక మనిషి జీవితంలో ఒకట్రెండు మేలి మలుపులు ఉంటాయి. ఆ మలుపులే ఆ వ్యక్తి గెలుపోటములకు కారణం అవుతాయి. పీవీ జీవితంలో ప్రతి సందర్భమూ ఒక విలక్షణమైన మలుపే! వాటిలో కొన్ని ఆయనను గెలుపు తీరాలకు చేరవేశాయి. మరికొన్ని వ్యక్తిగతంగా ఓడించినా దేశాన్ని విజయపథంలో నడిపించాయి. వాటి వివరాలు తెలుసుకోవాలంటే.. పీవీ జీవితంలోని అన్ని పార్శాలనూ తెలుసుకోవాల్సిందే. ఆయన వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాల్సిందే! ఆయనలోని ‘లోపలి
మనిషి’ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అందుకే, రచయిత డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి పీవీ జీవిత చరిత్రను విలక్షణంగా ఆవిష్కరించారు. ఆయన జీవితంలోని సందర్భాలన్నిటినీ ‘విలక్షణ పి.వి.- నరసింహారావుగారి జీవిత చరిత్ర’ పుస్తకంలో విశ్లేషణాత్మకంగా వివరించారు. బాల్యం మొదలుకొని మహాప్రస్థానం వరకు పీవీ జీవితాన్ని చిత్రిక పట్టి పాఠకులకు అందించారు. ఆయన బాల్యం, విద్యాభ్యాసం, సాహితీసేవ, రాజకీయ ప్రవేశం, పదవీయోగాలు, పాలన గండాలు, ప్రధానిగా చతురత ..ఇలా ఎన్నిటినో ఇందులో పొందుపరిచారు.
విలక్షణ పి.వి.
(నరసింహారావుగారి జీవిత చరిత్ర)
రచన: డా॥ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి
పేజీలు: 309, వెల: రూ.395
ప్రతులకు: నీల్కమల్ పబ్లికేషన్స్, ప్రముఖ పుస్తక కేంద్రాలు
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- books
- New Books Released
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Japan | జపాన్లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

