దేశదేశాల కవిత్వ ఆలింగనం
కవితలన్నీ మనుషులైతే... అమెరికా, రష్యా, జపాన్, శ్రీలంక... ఇలా మూలమూలల నుంచీ రెక్కలు కట్టుకుని ఒక దగ్గర వాలిపోతే... ఒకదానితో ఒకటి ఆలింగనం చేసుకుంటే... వెచ్చని స్పర్శను పంచుతూ కరచాలనం చేసుకుంటే.. ఆ బంధమే ‘పదబంధం’ - దేశదేశాల కవిత్వం. ఆ ప్రపంచాక్షరాల అలైబలైలో.. ప్రతి కవితా తన భాషను పరిచయం చేస్తుంది, జీవన విధానాన్ని వివరిస్తుంది. దేశకాల పరిస్థితుల్ని వెల్లడిస్తుంది.
కవితలన్నీ మనుషులైతే… అమెరికా, రష్యా, జపాన్, శ్రీలంక… ఇలా మూలమూలల నుంచీ రెక్కలు కట్టుకుని ఒక దగ్గర వాలిపోతే… ఒకదానితో ఒకటి ఆలింగనం చేసుకుంటే… వెచ్చని స్పర్శను పంచుతూ కరచాలనం చేసుకుంటే.. ఆ బంధమే ‘పదబంధం’ – దేశదేశాల కవిత్వం. ఆ ప్రపంచాక్షరాల అలైబలైలో.. ప్రతి కవితా తన భాషను పరిచయం చేస్తుంది, జీవన విధానాన్ని వివరిస్తుంది. దేశకాల పరిస్థితుల్ని వెల్లడిస్తుంది. తమ గడ్డ మీద స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాలను, ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి జరిగిన యుద్ధాలను, రాకాసి మూకల రక్తపాతాలను.. పంచుకుంటుంది. ఆ ఉద్వేగంలో అక్షరాలు ఏడ్చేస్తాయి, నవ్వేస్తాయి, కొన్నిసార్లు ఏడ్వలేక నవ్వేస్తాయి. ‘వేనవేల తలుపుల్ని తెరిచే/ తాళపు చెవి కావాలి/ కవిత్వం’, ‘నువ్వు చూడటం కోసం నేను గుడ్డివాణ్నవుతాను.. నువ్వు పాడటం కోసం నా గొంతునిస్తాను.. నువ్వు జీవించడం కోసం నేను మరణిస్తాను.. నా ఎముకల నుంచి పూసే.. ప్రతి పువ్వులో నువ్వు జ్వాలాముఖివై ప్రజ్వరిల్లాలి’.. ఒకటా రెండా గుండెల్ని పిండేసే వాక్యాలు, మనసుల్ని మెలితిప్పే పంక్తులూ పుస్తకం నిండా ఉన్నాయి. ఎన్నని ఏరుకోగలం, ఎన్నని పేర్కోగలం? పుస్తకంలో ప్రతి పేజీ యుద్ధోన్మాదాన్ని నిరసిస్తుంది, రక్త పిశాచాలను నిలదీస్తుంది. ‘మా నగరం ఓ జైలుగది’ అనే వాక్యం వెనుక విశ్వమంత విషాదం. ఎవరి స్వార్థం కోసమో తుపాకులు పట్టుకున్నవారు, ఎవరి సామ్రాజ్యవాద కాంక్ష కారణంగానో బిచ్చమెత్తుకుంటున్నవారు, ఎవరి మత మౌఢ్యం కారణంగానో శాపగ్రస్తులై బతుకుతున్నవారు.. ఈ పుస్తకం నిండా కనిపిస్తారు. ప్రతి పేజీ చివరలో ముడుచుకుని కూర్చున్నట్టు అనిపిస్తారు. వెంకటయోగి అనువాదంతోనే సరిపెట్టుకుని ఉంటే.. ఇంత గాఢత వచ్చేది కాదు. ఆత్మనూ పట్టుకున్నారాయన. ఇది ప్రపంచ కవిత్వమే కాదు, ప్రపంచంలోని ప్రతి దేశం తమ కథే అని అంగీకరించే కవిత్వం.
పదబంధం దేశదేశాల కవిత్వ కరచాలనం
రచన: నారాయణస్వామి వెంకటయోగి
పేజీలు: 312; వెల: రూ.200
ప్రచురణ: కవిసంగమం బుక్స్
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
బుక్ షెల్ఫ్
హితోక్తులు (దివ్య మానవ వాణి)

రచన: డా. వెన్నెలకంటి ప్రకాశం
వెల: రూ. 250
ప్రతులకు: 99514 84161
పసుల రంకె (కథల సంపుటి)

రచన: దేవరశెట్టి జనార్దన్
పేజీలు: 98; వెల: రూ. 50
ప్రతులకు: 95502 92727
కోవిడ్-ఎయిడ్స్-నేను

రచన: డాక్టర్ యనమదల మురళీకృష్ణ
పేజీలు: 164; వెల: రూ. 200
ప్రతులకు: 94910 31492
నా ఏకాంత బృందగానం

రచన: డా. అమృతలత (సచిత్ర ఆత్మకథ)
పేజీలు: 404, వెల: రూ. 600
ప్రచురణ: అపురూప పబ్లిషర్స్
ప్రతులకు: పాలపిట్ట బుక్స్, నవోదయ బుక్ హౌజ్
ఫోన్: 98488 68068
ఉద్యమ సంతకం

రచన: బొమ్మగాని నాగభూషణం
పేజీలు: 109
వెల: రూ. 100
ప్రతులకు: ఫోన్: 98496 22633, ప్రముఖ పుస్తక కేంద్రాలు
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

