పుస్తక సమీక్ష
మహిళలు సాధించిన విజయాలు, ఎదుర్కొంటున్న సామాజిక-ఆర్థిక సమస్యల పట్ల గొంతెత్తే పత్రిక భూమిక. ఏ పత్రికకైనా సంపాదకీయం హృదయం లాంటిది. 2012 నుంచి 2023 వరకు భూమికలో వివిధ సందర్భాల్లో స్పందనగా వచ్చిన సంపాదకీయాలను ‘వాడిపోని మాటలు2’, ‘వాడిపోని మాటలు 3’ పేరుతో ఆ పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి రెండు సంకలనాలుగా తీసుకొచ్చారు.
పుస్తకంలేని ఇల్లు.. ఆత్మలేని శరీరం లాంటిది.
కీలక ‘భూమిక’
మహిళలు సాధించిన విజయాలు, ఎదుర్కొంటున్న సామాజిక-ఆర్థిక సమస్యల పట్ల గొంతెత్తే పత్రిక భూమిక. ఏ పత్రికకైనా సంపాదకీయం హృదయం లాంటిది. 2012 నుంచి 2023 వరకు భూమికలో వివిధ సందర్భాల్లో స్పందనగా వచ్చిన సంపాదకీయాలను ‘వాడిపోని మాటలు2’, ‘వాడిపోని మాటలు 3’ పేరుతో ఆ పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి రెండు సంకలనాలుగా తీసుకొచ్చారు. అగ్ని క్షిపణి అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన టెస్సీ థామస్ కృషికి నీరాజనం పడుతూ రాసిన ‘అగ్నిపుత్రి’తో ఈ సంకలనాలు ప్రారంభమవుతాయి. ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్, మణిపుర్ మహిళల హక్కుల కోసం పోరాడిన ఇరోమ్ చాను షర్మిల, సామాజిక ఉద్యమకారిణి మల్లాది సుబ్బమ్మ తదితరులపై రాసిన సంపాదకీయాలు మహిళలు వంటింటికి మాత్రమే పరిమితం కాదు… వారి పరిధి విశ్వవ్యాప్తం అని వివరిస్తాయి.
అదే సమయంలో నిర్భయ లాంటి దుర్ఘటనలు, ఆమ్లదాడులు, మధుర, బృందావనం క్షేత్రాల్లో వితంతువుల దుస్థితి, నిర్బంధ వైధవ్యం లాంటివాటిపై స్పందనలు మనల్ని ఆలోచింపజేస్తాయి. జీవితం కూలిపోతున్నా శక్తిని కూడదీసుకుని నిలిచి ‘ఐనా నేను ఓడిపోలేదు’ అని గెలుపు తీరాలు చేరుకున్న జ్యోతి జీవిత ప్రయాణం గురించి వివరించే ‘మైలారం పిల్ల… పిల్ల కాదు… మహాపిడుగు’, వ్యవసాయం మహిళల చేతుల్లోనే భద్రంగా ఉంటుందని చెప్పే సంపాదకీయం లాంటివి స్త్రీ సాధికారత ఆవశ్యకతను చాటుతాయి. ఈ సంపాదకీయాలు చదివితే గడచిన పదేండ్ల కాలంలో భారత మహిళల స్థితిగతులు ఎలా ఉన్నాయో, వారి సాధికారత కోసం ఏం చేయాలో అవగాహనకు వస్తుంది.
వాడిపోని మాటలు – 2, 3
సంపాదకులు: కొండవీటి సత్యవతి
ధర: ఒక్కొక్కటి రూ. 200
ప్రచురణ: భూమిక ప్రచురణలు
ప్రతులకు: ఫోన్ 040 27660173
ధ్వజస్తంభాలు

Books2
రచన: గన్నవరపు నరసింహమూర్తి
పేజీలు: 104
ధర: రూ. 100
ప్రచురణ: పాలపిట్ట బుక్స్
ప్రతులకు:
ఫోన్: 98487 87284
కవనం (కవిత్వం)

రచన: గంగాడి సుధీర్
పేజీలు: 151
వెల: రూ.160
ప్రతులకు: నవచేతన,ఎమెస్కో బుక్స్
ఫోన్: 93944 86053
రెండు ఆకాశాల మధ్య

రచన: సలీం
పేజీలు: 252
ధర: రూ. 200
ప్రతులకు: నవోదయ
ఫోన్: 90004 13413
…? చింతలపల్లి హర్షవర్ధన్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

