Vastu Shastra | చెరువును ఆనుకొని ఉన్న ఊర్లు బాగుండవు అంటారు.. అది నిజమేనా?
మీరు వ్యాపారులు కాబట్టి.. అన్నిటికీ దగ్గరలో ఉండాలి అనుకుంటారు. తప్పులేదు. మీ ప్లాన్ చూశాను. మీకు స్థలం ఎక్కువగానే ఉంది కాబట్టి.. శాస్త్రపరంగా కట్టుకునే అవకాశం ఉంది. పడమర వీధి కలిగిన మీ స్థలంలో దక్షిణ - నైరుతిని వేరుచేస్తూ.. అంటే, ఉన్న స్థలంలో దక్షిణం ఒక భాగం - ఉత్తరం ఒక భాగంగా స్థలాన్ని విభజించండి.
సినిమా హాల్, ఇల్లు ఒక్క దగ్గర కట్టుకోవచ్చా? ఏది, ఎటువైపు ఉండాలి?
– కె. మోహన్, కరీంనగర్.
Vastu Shastra | మీరు వ్యాపారులు కాబట్టి.. అన్నిటికీ దగ్గరలో ఉండాలి అనుకుంటారు. తప్పులేదు. మీ ప్లాన్ చూశాను. మీకు స్థలం ఎక్కువగానే ఉంది కాబట్టి.. శాస్త్రపరంగా కట్టుకునే అవకాశం ఉంది. పడమర వీధి కలిగిన మీ స్థలంలో దక్షిణ – నైరుతిని వేరుచేస్తూ.. అంటే, ఉన్న స్థలంలో దక్షిణం ఒక భాగం – ఉత్తరం ఒక భాగంగా స్థలాన్ని విభజించండి. దక్షిణ భాగంలో మీ ఇంటిని కట్టుకోవాలి. ఉత్తర భాగంలో సినిమా హాల్ కట్టాలి. రెండు వేరువేరైన భాగాలకు వేరువేరుగా కాంపౌండు కట్టి, వేరువేరుగానే గేట్లు పెట్టండి.
దక్షిణంవైపు మీ ఇంటి ఆవరణం నుంచి ఉత్తరంలోని సినిమా హాల్లోనికి వెళ్లేలా గేటు పెట్టుకోవచ్చు. ఆవిధంగా మీకు అనుకూలంగా ఉంటుంది. పశ్చిమం రోడ్డు కాబట్టి ఇబ్బంది లేదు. దేని గేటు దానికి పశ్చిమ – వాయవ్యంలో వస్తాయి. అయితే, సినిమా హాల్ పెద్దది కదా.. దానిని నైరుతిలో కట్టాలి. ఇల్లు చిన్నది కదా అందుకని ఉత్తరంవైపు కట్టాలి అని అనుకోవద్దు. యజమాని స్థానం ప్రధానం కదా!
మాది జిన్నింగ్ మిల్లు. లారీ కాంటా (వేయింగ్ మెషిన్) దగ్గరే ఆఫీస్ కట్టాలి. ఎక్కడ, ఎలా కట్టమంటారు? మాది దక్షిణం రోడ్డు.
– బి. ఉదయ్ కుమార్, గజ్వేల్.
వేయింగ్ మెషిన్కు గుంత కావాలి. ఆఫీస్ నైరుతిలో కట్టాలి. మీది జిన్నింగ్ మిల్లు కాబట్టి.. దక్షిణంలో షెడ్డు, యంత్రాలు ఏర్పాటు చేసుకొని, ఉత్తర – వాయవ్యంలో కూడా మీ ఆఫీస్ కట్టుకోవచ్చు. మీకు దక్షిణం రోడ్డు ఉంది కాబట్టి.. కాంపౌండు లోపల దక్షిణ – నైరుతిలో ఆఫీస్ కట్టుకోండి. తూర్పు మధ్యలో వేయింగ్ మెషిన్ పెట్టండి. దానిని జాగ్రత్తగా గమనించాలి కాబట్టి, ఆ కాంటాకు దక్షిణంలో చిన్న గది కట్టి, అందులో యజమాని తాలూకు వ్యక్తిని కూర్చోబెట్టాలి. లేదా సీసీ కెమెరాలు పెట్టుకొని ఆఫీస్లోంచి గమనించవచ్చు. భూమిలో గొయ్యి లేకుండా ఎత్తుగా కూడా లారీ కాంటాలను ఏర్పాటుచేసుకొని, దానికి పడమరలో ఫ్లోరింగ్ పెంచుకొని అక్కడ ఆఫీస్ కట్టుకోవచ్చు. ఆ విధంగా కూడా ఆఫీస్, కాంటా మెషిన్ ఒక్కదగ్గర ఉంటాయి. ఏదైనా గుంతలు – గోతులు, దక్షిణం – పడమర దిశలు నిషేధం కాబట్టి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి.

పెద్దపెద్ద హౌజులు కట్టి, వాటిల్లో చేపలు పెంచాలని అనుకుంటున్నాం. వాటిని తూర్పులో కట్టొచ్చా?
– జి. లక్ష్మి, గుండాల.
అవును.. కొందరు తమ వ్యవసాయ భూముల్లో, నీటి తొట్లల్లో చేపల పెంపకం చేపడుతున్నారు. దీనికి సంబంధించి మనకు ఉన్న స్థలంలో రోడ్డును బట్టి, ఇంటిని బట్టి.. తూర్పులోనే – ఉత్తరంలోనే – ఈశాన్యంలోనే ఈ నీటితొట్లు కట్టుకోవాలని ఆలోచించకండి. దక్షిణం – పడమర – నైరుతి దిశల్లో కూడా నేలమీద పెద్దపెద్ద తొట్లు కట్టుకోవచ్చు. గొయ్యితీసి, నీటిని నిలువ చేసి.. చేపల పెంపకం చేయాల్సి వస్తే వేరు. అది తప్పకుండా తూర్పు లేదా ఈశాన్యంలోనే చేయాల్సి ఉంటుంది. ఇంటిమీద మనమందరం నైరుతిలో నీళ్ల ట్యాంకులు ఎలాగైతే పెట్టుకుంటున్నామో.. అలాగే, మన పరిధి కలిగిన స్థలంలో దక్షిణ – పడమరల్లో మాత్రమే నీళ్ల ట్యాంకులు కట్టాలి. ఈశాన్యం అని, నీరుండాలని.. తూర్పు – ఉత్తరంలో కట్టవద్దు.
చెరువును ఆనుకొని ఉన్న ఊర్లు బాగుండవు అంటారు. అది నిజమా?
– డి. రాములు, చేర్యాల.
చెరువులు ప్రతి ఊరికీ ఎక్కడో అక్కడ ఉంటేనే కదా.. ఆ ఊరు సస్యశ్యామలంగా ఉంటుంది. ఊరికి చెరువు ఉండటం తప్పుకాదు. చెరువు దగ్గరగా కట్టను ఆనుకొని ఇండ్లు కట్టుకోవడం మంచిదికాదు. నీటి ధర్మాలు వేరుగా ఉంటాయి. అవి ఎన్నడూ మారవు. చెరువు వద్ద గృహాలు ఉండటం వల్ల జలశక్తి అధికం అవుతుంది. తద్వారా గృహం జలాధీనం అయ్యే అవకాశం ఉంటుంది. ఇంటికి పంచభూతాలు సమపట్టుగా ఉండాలి. ఏవి ఎంత పరిమాణంలో ఉండాలో.. అంతనే ఉండాలి. అప్పుడే ఇంటికి సమస్థితి చేకూరుతుంది. కొన్ని పల్లెలు దక్షిణం – పడమర పెద్దపెద్ద చెరువులను ఆనుకొని ఉండటం వల్ల తప్పక ఆర్థిక నష్టాలు ఉంటాయి. చెరువుకు దగ్గరగా కాకుండా.. దూరంగా ఇండ్లు కట్టుకోవాలి. అలాగే, ప్రతి ఇంటికీ తప్పకుండా కాంపౌండ్ ఉండాలి. ఏదైనా.. అధిక శక్తి వాడకం జరిగితే అనర్థాలే కలుగుతాయి.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

