Dum Chai | తయారీ : గిన్నెలో నీళ్లు పోయాలి. అవి మసులుతున్నప్పుడు అల్లం, యాలకులు దంచుకొని అందులో వేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత టీ పొడి వేసి మరో మూడు నిమిషాలు మరిగించి పాలు పోసుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత సన్నని మంటపై మరో నిమిషం మరగనివ్వాలి. చివరిగా చక్కెర వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేడివేడి టీని వడకట్టుకోవాలి.
ఇప్పుడు మట్టి గురిగిని స్టౌ మీద పెట్టి అన్ని వైపులా బాగా కాల్చుకోవాలి. బాగా కాలిన తర్వాత గురిగిని వెడల్పాటి పాత్రలో ఉంచి.. ఇందాక వడకట్టుకున్న టీని అందులో పోసుకోవాలి. గురిగి వేడితనం, మట్టి ఫ్లేవర్ టీకి అదనపు రుచిని అందిస్తుంది.