ఎత్తయిన పోస్టాఫీస్…

హిమాచల్ ప్రదేశ్లో ఓ పోస్టాఫీస్ ఉంది. అది అత్యంత ఎత్తయిన తపాలా కార్యాలయం. హిమాచల్ అంటే తెలుసు కదా! హిమాలయ పర్వతాలు ఉండేది అక్కడే. ఆ పర్వతాల మధ్యలో.. ఓ మారుమూల గ్రామంలో ఉందీ కార్యాలయం. దాని పేరు ‘హిక్కిం’. అత్యంత ఎత్తయిన కొండలపైన ఉండటంతో ఇదే ప్రపంచంలో ఎత్తయిన పోస్టాఫీస్గా పేరుగాంచింది. సముద్ర మట్టానికి 4,400 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ పోస్టాఫీసు నుంచి ప్రపంచ నలుమూలలకూ ఉత్తరాలు వెళ్తుంటాయి. ఇక్కడ ఐదు చిన్న చిన్న గ్రామాలున్నాయి. ఈ ప్రాంతంలో మొబైల్ సిగ్నల్స్ చాలా తక్కువ. ఇంటర్నెట్ అసలు ఉండదు. వీరి కోసమే ఈ పోస్టాఫీసును ఏర్పాటు చేశారు. ఉత్తరాలు పంపేందుకు, ఖాతాల్లో డబ్బు జమ చేసేందుకు నిత్యం గ్రామస్తులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చే చాలా మంది పర్యాటకులు అత్యంత ఎత్తులోని ఈ పోస్టాఫీసు నుంచి ఉత్తరాలు పంపడాన్ని గొప్ప అనుభూతిగా భావిస్తారు. ప్రమాదకరమైన దారులు, ఎముకలు కొరికే చలి.. ఈ లోయ ప్రత్యేకత. ఇక్కడకు వెళితే ఓ కొత్త ప్రపంచానికి వెళ్లినట్టుగా ఉంటుంది. 1983లో భారత తపాలా శాఖ ఈ పోస్టాఫీసును ప్రారంభించింది. ఇక్కడి నుంచి ఉత్తరాలను బట్వాడా చేయాలంటే చాలావరకు కాలినడకనే వెళ్లాలి. విపరీతమైన మంచు కురుస్తున్నప్పుడు మూసేస్తారు. స్పితి లోయకు ప్రధాన కేంద్రంగా ఉన్న కాజా పట్టణానికి ఈ పోస్టాఫీసు నుంచి ఉత్తరాలు తీసుకెళ్తారు. రోజూ ఇద్దరు పోస్ట్మెన్లు కొండాకోనలను దాటుకుంటూ రానుపోను కలిపి దాదాపు 46 కిలోమీటర్లు నడుస్తారు. కాజా నుంచి హిమాచల్ ప్రదేశ్లోని ఇతర ప్రధాన పట్టణాలకు రోడ్డు మార్గాల ద్వారా బస్సుల్లో ఉత్తరాలను పంపుతారు.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

