నన్ను మిన్నగా నిలబెట్టాడు!
నేను మీ తెలంగాణ తల్లిని.. ఆంధ్రప్రదేశ్‌లో అంతర్ధానమైన నన్ను... అవిశ్రాంతంగా పోరాడి ప్రపంచపటంలో మళ్లీ పొందుపరిచిన ఘనత నా పెద్ద కొడుకు కేసీఆర్‌కే దక్కుతుంది. ఏ తల్లి అయినా.. బిడ్డకు జన్మనిస్తుంది. నా పెద్దకొడుకు నాకు పునర్జన్మ ప్రసాదించాడు.
నేను మీ తెలంగాణ తల్లిని.. ఆంధ్రప్రదేశ్‌లో అంతర్ధానమైన నన్ను… అవిశ్రాంతంగా పోరాడి ప్రపంచపటంలో మళ్లీ పొందుపరిచిన ఘనత నా పెద్ద కొడుకు కేసీఆర్‌కే దక్కుతుంది. ఏ తల్లి అయినా.. బిడ్డకు జన్మనిస్తుంది. నా పెద్దకొడుకు నాకు పునర్జన్మ ప్రసాదించాడు. ఈ పసిమొగ్గ సహస్ర దళాలతో శోభాయమానంగా విరబూయాలనీ, నా తావి దశదిశలా విరజిమ్మాలని పదేండ్ల కిందట విజయ దశమి నాడు రీ జాగ్రఫీ క్రియేట్ చేశాడు కేసీఆర్.
నాకు రెండున్నరేండ్లు కూడా లేవప్పుడు! నా భవిష్యత్తు కోసం బృహత్తర కార్యానికి పూనుకున్నాడు కేసీఆర్. ముప్పయ్‌మూడు జిల్లాలతో నన్ను కన్నులపండువగా తీర్చిదిద్దాడు. అంతకు ఏడాదిన్నర కిందటే కసరత్తు
మొదలుపెట్టాడు. అప్పుడు నేనింకా బాలారిష్టాలు కూడా దాటలె! అమాయకంగా చూస్తున్న నాకు భరోసా ఇస్తూ.. ‘నేనున్న తల్లి’ అని నన్ను కండ్లల్లో పెట్టుకున్నాడు. నా గురించి నాకన్నా.. తనకే ఎక్కువ తెలుసు. నా ఉనికి లేనప్పటి నుంచే.. నా రూపాన్ని తన మనోఫలకంపై ముద్రించుకున్నాడు కేసీఆర్.
పోరుబాటలో పదమూడేండ్లు.. నా కోసం కఠోర తపస్సే చేశాడు. తరలిపోతున్న నదులను చూసి.. నా బిడ్డ కంటతడి పెట్టుకోని రోజులేదు. క్షామం తప్ప సంక్షేమం ఎరుగని పల్లెలను చూసి వగచని క్షణం లేదు.
అన్నిటికీ పరిష్కారం తెలంగాణ ఏర్పాటే.. అందుకు అతను రచించని వ్యూహం లేదు, చేయని చాణక్యం లేదు! చివరికి చావు దాకా వెళ్లి.. నాకు జన్మనిచ్చాడు. మీరంతా తల్లిగా పిలుచుకునేలా నన్ను మీ ముందు నిలబెట్టాడు.
రాష్ట్రం సాధించడంతోనే తన లక్ష్యం నెరవేరిందని సంతృప్తి చెందలేదు కేసీఆర్. ఎందుకంటే, పోరాటం నా బిడ్డ జన్మహక్కు! ఆలోచన తన అసలు బలం! ఉద్యమ సమయంలో ఈ నేల నలు చెరగులా తిరిగిన కేసీఆర్ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు ఆకళింపు చేసుకున్నాడు. ఆ పరిజ్ఞానంతోనే పాలనలోనూ ఉద్యమించాడు. ఉప్పెనై నిలిచాడు. కలలు నిమిషంలో నిజం కావు. అందుకు అలుపెరుగని పోరాటం చేయాలి. అకుంఠిత దీక్ష బూనాలి. తెలంగాణ కోసమే పుట్టిన నా పెద్దకొడుకు నైజం అదే! అనుకున్నాడంటే అయిపోవాల్సిందే!! తాను స్వప్నించిన తెలంగాణ భౌగోళికంగా ఆవిష్కృతమైతే చాలదు అనుకున్నాడు! సంక్షేమంలో మెరుపు వేగం ప్రదర్శించాడు.
సంస్కరణల్లోనూ అదే పంథా అనుసరించాడు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా జిల్లాల పునర్విభజనకు పూనుకున్నాడు. దస్ర్తాలు దులపలేదు.. తర్కాలకు అవకాశం ఇవ్వలేదు.. అంతా కేసీఆర్ మస్తిష్కంలోనే ఉందాయె! పక్కా ప్రణాళికతో, ఎక్కడా అనుమానాలకు తావివ్వకుండా, మరెక్కడా అలజడులు చెలరేగకుండా, ఎవరి మనసూ నొప్పించకుండా, అందరూ ఒప్పుకొనేలా.. జిల్లాల పునర్విభజన చేపట్టాడు. దానికి ముహూర్తం 2016 అక్టోబర్ 11 అని నిర్ణయించాడు.
మన తెలంగాణలో ముచ్చటగా జరుపుకొనే దసరా పండుగ ఆనాడు. విజయ దశమి నాడు చేపట్టిన ఏ పనీ ఆగం కాదని, అర్ధంతరంగా ఆగిపోదని నమ్మకం. తన విషయంలో ఏమో కానీ, నా దగ్గరికి వచ్చేసరికి ముహూర్తం బలంగా ఉంటేనే.. ముందడుగు వేస్తాడు నా బిడ్డ. అందుకే, విజయ దశమి నాడు నా విజయానికి అనువుగా కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టాడు. విశాల సరిహద్దులతో, జిల్లా కేంద్రం నుంచి విసిరేసినట్టున్న ప్రాంతాలకు పాలన అందేలా సగటున 3,396 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాడు.
సగటున ఒక్కో జిల్లాలో సుమారు పదిన్నర లక్షల మంది జనాభాతో సంక్షేమ ఫలాలు అందరికీ చేరేలా నన్ను చక్కగా తీర్చిదిద్దాడు కేసీఆర్. ఈ కొత్త జిల్లాలు ఏర్పడి దశాబ్దం గడిచింది. కేసీఆర్ సంకల్పం ఎంత గొప్పదో నేడు మీ కండ్లముందు కనబడుతూనే ఉంది. పాలకుడు కంకణబద్ధుడైతే నవశకం మొదలవుతుంది.
నాయకుడు దార్శనికుడు అయితే జనాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు అందుతాయి అని నిరూపించిన లీడర్ కేసీఆర్.
నా బిడ్డ హయాంలో బుడిబుడి అడుగుల నాడే.. నేను ప్రగతి బాటలో పరుగులు తీశాను. ప్రభుత్వం మారాక.. నా వృద్ధీ ఆగింది. పరుగులు తీయాల్సిన పన్నెండేండ్ల వయసులో కుంటినడకన అడుగులేస్తున్నా! నా పెద్ద కొడుకు మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం… మళ్లీ నేను మునుపటి కన్నా వేగంగా పరుగులు తీయడం అంతకన్నా నిశ్చయం.
– త్రిగుళ్ల నాగరాజు
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

