తొందరపాటు
నరసింహపురంలో శరభయ్య అనే వస్ర్తాల వ్యాపారి ఉండేవాడు. అతను ఎప్పుడూ న్యాయమైన వ్యాపారమే చేసేవాడు. దాంతో, అతనికి ఊరిలో మంచిపేరు ఉంది. ఇలా ఉండగా ఒకరోజు అతని బావ వైకుంఠం.. తన మిత్రుడు సోమయ్యతో కలిసి శరభయ్య దుకాణానికి వచ్చాడు.
నరసింహపురంలో శరభయ్య అనే వస్ర్తాల వ్యాపారి ఉండేవాడు. అతను ఎప్పుడూ న్యాయమైన వ్యాపారమే చేసేవాడు. దాంతో, అతనికి ఊరిలో మంచిపేరు ఉంది. ఇలా ఉండగా ఒకరోజు అతని బావ వైకుంఠం.. తన మిత్రుడు సోమయ్యతో కలిసి శరభయ్య దుకాణానికి వచ్చాడు. ఇద్దరూ చెరో కండువా తీసుకున్నారు. వాటి డబ్బులను తర్వాత ఇస్తామని చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత రోజు వైకుంఠం తన కండువా ధర నూటా యాభై రూపాయలు చెల్లించాడు. వారం రోజుల తర్వాత వైకుంఠం మిత్రుడు సోమయ్య.. శరభయ్య దుకాణానికి వెళ్లి కండువా డబ్బులు ఇవ్వబోయాడు. అప్పుడు శరభయ్య అతని దగ్గరి నుంచి మూడు వందల రూపాయలు తీసుకున్నాడు. మరునాడు తనను కలిసిన వైకుంఠంతో “ఒరేయ్! మీ బావ దగ్గర కొన్న కండువాకు నా దగ్గర మూడు వందల రూపాయలు తీసుకున్నాడు” అని చెప్పాడు సోమయ్య. ఆ మాటలు విని వైకుంఠం ఆశ్చర్యపోయాడు. శరభయ్య ఎంతో న్యాయంగా వ్యాపారం చేస్తాడనీ, ఒకరిని మోసం చేయడని వైకుంఠం అన్నాడు.
కానీ, సోమయ్య ఒప్పుకోలేదు. ఆ సాయంత్రమే శరభయ్య దగ్గరికి వచ్చి “నా మిత్రుడు అయినందుకు సోమయ్య దగ్గర ఒక్క కండువాకు మూడు వందల రూపాయలు తీసుకుంటావా! నా దగ్గర కూడా అంతే తీసుకో!” అంటూ చిందులు వేశాడు వైకుంఠం. అది విన్న శరభయ్య నవ్వి.. “బావా! నీ మిత్రుని దగ్గర నేను ఎక్కువగా తీసుకుంటానా! ఆయన గతంలో ఒక కండువా తీసుకొని నాకు డబ్బులు ఇవ్వలేదు. మరచిపోయినట్లు ఉన్నాడు. అందుకే, రెండు కండువాల డబ్బు తీసుకున్నాను. నిజానికి, ఇప్పుడు ఆ కండువా ధర పెరిగింది. వాస్తవంగా అతని వద్ద నేను నూటా అరవై రూపాయలు తీసుకోవాలి. కానీ, నీ మిత్రుడు కాబట్టి.. నీకు ఇచ్చిన ధరకే ఆయనకూ ఇచ్చాను. కావాలంటే, గతంలో ఆయన వెంబడి వచ్చిన ఆ రామయ్యను అడుగు. నీకు అసలు సంగతి చెబుతాడు” అని వివరించాడు. వైకుంఠం వెళ్లి రామయ్యను అడిగితే.. శరభయ్య చెప్పింది నిజమమేనని అన్నాడు. అప్పుడు వైకుంఠం.. తాను తొందరపడి తన బావ శరభయ్యను అపార్థం చేసుకున్నందుకు చింతించాడు. తన మిత్రునితో.. “ఒరేయ్! నీవు తప్పు చేస్తే.. నేను తొందరపడి మా బావను నిందించాను” అంటూ జరిగిన సంగతి చెప్పాడు. తాను మతిమరుపు వల్ల ఆ కండువా డబ్బు కట్టలేదని సోమయ్య కూడా ఒప్పుకొన్నాడు. అందుకే.. ఏ విషయంలోనూ తొందరపాటు పనికిరాదు.
– సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
పెద్దల మాట
హింసాత్మక పోకడలతో సాధించిన విజయం ఓటమితో సమానం.
– మహాత్మా గాంధీ
చెప్పుకోండి
రాతి శరీరం. మధ్యలో నోరు. తిరుగుతూ ఉంటుంది. తింటూ కక్కుతుంది?
– రుబ్బురోలు
దాస్తే పిడికిలిలో దాగుతుంది. తీస్తే ఇల్లంతా జారుతుంది?
– దీపం వెలుగు
తెలిసి కాయ కాస్తుంది. తెలియకుండా పువ్వు పూస్తుంది?
– అత్తిచెట్టు
పద్యం – భావం
చచ్చిపడిన పశువు చర్మంబు కండలు
పట్టి పెఱిగి తినును పరగ గ్రద్ద
గ్రద్ద వంటివాడు జగపతి కాడొకో
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: చనిపోయిన పశువుల చర్మాన్ని, కండను గద్ద తింటుంది. పేదవాళ్ల నుంచి పన్నులు వసూలు చేసే రాజులు కూడా ఆ గద్ద లాంటివారే!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టా!
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

