Nallamala Forest | కనువిందు చేస్తున్న నల్లమల ప్రకృతి అందాలు
ఊటీవరకూ వెళ్లలేనివారికి, కొడైకెనాల్ కోరిక తీరనివారికి సూక్ష్మంలోనే పర్యాటక మోక్షం.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అటవీ ప్రాంతం. జటప్రోలు, సోమశిల, మంచాలకట్ట, అమరగిరి పరిసరాల్లో ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. పొరుగున ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాలూ ఆకట్టుకుంటాయి.
చరిత్ర పాఠాలు చెప్పే శాసనాలు, ప్రకృతి సౌందర్యాన్ని పరిచయం చేసే వాగులూ వంకలు, కృష్ణా తీరం వెంబడి ఆధ్యాత్మిక క్షేత్రాలు, దట్టమైన అడవిలో వన్యప్రాణుల సందళ్లు.. మొత్తంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అటవీ ప్రాంత అందాన్ని ఆస్వాదించాల్సిందే. అనేక అనుభూతులను మూటగట్టుకుని తిరిగొస్తాం. మరొక్కసారి వెళ్లాలనీ తీర్మానిస్తాం.
Nallamala Forest | ఊటీవరకూ వెళ్లలేనివారికి, కొడైకెనాల్ కోరిక తీరనివారికి సూక్ష్మంలోనే పర్యాటక మోక్షం.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అటవీ ప్రాంతం. జటప్రోలు, సోమశిల, మంచాలకట్ట, అమరగిరి పరిసరాల్లో ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. పొరుగున ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాలూ ఆకట్టుకుంటాయి. అందుకే, ఈ సీజన్లో ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు తరలివస్తారు. మంచాలకట్ట దగ్గర కృష్ణానది అలల తాకిడి ఆనందానుభూతులను పంచుతుంది. నల్లమలలో మయూరాల నాట్యాలు, లేడి కూనల పరుగులు, రకరకాల పక్షుల కువకువలు, పులుల గాండ్రిపులు.. ప్రత్యక్షంగా అనుభూతి చెందాల్సిందే.
సప్తనదుల సంగమంలోని అమరగిరి ప్రాంతం ముందు.. ఊటీ దిగదుడుపే. కొల్లాపూర్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరగిరికి వెళ్తున్నప్పుడు దారి పొడవునా పచ్చని చెట్లు, వంపులు తిరిగిన రోడ్డు, ఎత్తయిన కొండలు, పాతాళానికి దారిచూపేలా ఉన్న లోయలు కట్టిపడేస్తాయి. సీతాకోక చిలుకలు సాదర స్వాగతం పలుకుతాయి. అమరగిరి నుంచి అరగంట బోటులో ప్రయాణిస్తే మల్లయ్య సెల వస్తుంది. ఇక్కడి సెలయేటి పరుగులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
అమరగిరి నుంచి బోటులో రెండు గంటలు (8 కిలోమీటర్లు) ప్రయాణిస్తే చీమలతిప్ప ద్వీపానికి చేరుకోవచ్చు. అంకాలమ్మ కోట కొండపై నుంచి ప్రకృతి అందాలు తిలకించడం ఓ మంచి అనుభవం. చీమలతిప్ప ద్వీపం వద్ద విశాఖపట్నం జాలర్లు తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకొని కృష్ణానదిలో చేపల వేట కొనసాగిస్తారు. ద్వీపం చుట్టూ లంగరు వేసిన మరబోట్లు, నాటు పడవలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. కొత్త అనుభూతుల్ని పంచుతాయి.
ట్రెక్కింగ్ చేయాల్సిందే..

అంతెత్తు మీదున్న అంకాలమ్మను దర్శించుకోవాలంటే 600 మీటర్ల ఎత్తు ఉన్న కొండపైకి ట్రెక్కింగ్ చేయాల్సిందే. కోటపై నుంచి చీమలతిప్పను చూస్తే ద్వీపంలోని మనుషులు చీమల్లానే కనిపిస్తారు. శత్రు దుర్భేద్యంగా 10 అడుగుల ఎత్తుతో, 5 అడుగుల వెడల్పుతో కొండ చుట్టూ కట్టిన పటిష్ఠమైన రాతి గోడ
చైనా వాల్‌ను తలపిస్తుంది. ఇక్కడ అమ్మవారు శాంతి స్వరూపిణిగా కొలువుదీరారు. కొండపై బావిలో ఎల్లప్పుడూ నీళ్లు పుష్కలంగా ఉంటాయి. గత చరిత్రకు ఆధారాలుగా శిలాశాసనాలు కూడా ఉన్నాయి. ఈ కోట చాళుక్యుల కాలం నాటిదని అంటారు.
చూడాల్సిందే..
ఇక, కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో చూడదగిన ప్రదేశాల్లో.. జటప్రోలు సంస్థానం, కొల్లాపూర్ పట్టణంలోని మాధవస్వామి ఆలయం, చంద్రమహల్, రాణీమహల్, మంత్రమహల్, సింగపట్నంలోని శ్రీవారి సముద్రం, తీరంలో నెలకొన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, లక్ష్మీదేవమ్మ గుట్ట, సోమశిలలోని లలితాసోమేశ్వర ఆలయం, శ్రీవేంకటేశ్వర ఆలయం ముఖ్యమైనవి. కొల్లాపూర్ సంస్థానానికి నిజాం, బ్రిటిష్ పాలనలో ప్రత్యేక స్థానం ఉండేది. సురభి రాజుల కాలంలో నిర్మితమైన కట్టడాలు నాటి వైభవానికి ప్రతీకలు. హైదరాబాద్ నగర వాసులు వారాంతంలో ప్లాన్ చేసుకుంటే.. శ్రీశైల మల్లికార్జునుడి దర్శనమూ అవుతుంది.
కాటేజీల సోయగం
సోమశిలలో ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌లతో పాటు టూరిజం శాఖ కాటేజీలూ ఉన్నాయి. లాంచి, బోటింగ్ సౌకర్యం ఉంది. క్యాంప్ ఫైర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సింగోటం వద్ద సైతం కాటేజీలు నిర్మించారు. మంచాలకట్ట దగ్గర కృష్ణానది సముద్రాన్ని తలపించే అనుభూతి ఇస్తుంది. ఇక్కడికి వలస పక్షులు భారీ సంఖ్యలో వస్తాయి. హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్ మీదుగా కొల్లాపూర్ చేరుకోవచ్చు. ఇక్కడినుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరాల్లో ఉన్న అమరగిరి, సింగోటం, సోమశిల, జటప్రోలు వెళ్లడం పెద్ద కష్టమేం కాదు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలూ అందుబాటులో ఉన్నాయి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

