చిన్న కుక్కలే ఎక్కువకాలం జీవిస్తాయా!
చిన్న పరిమాణంలో ఉండే కుక్కలే ఎక్కువ కాలం జీవిస్తాయట. ఇది ఎవరో కాదు అన్నది. వీటిపై పరిశోధనలు చేసిన చెబుతున్న విషయం. డాగ్ ఏజింగ్ ప్రాజెక్ట్ కింద వందల కుక్కల డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించారు.
కుక్కల్లో మాత్రం రివర్స్
సాధారణంగా జంతువుల పరిమాణాన్ని బట్టి వాటి ఆయుర్దాయం పెరుగుతుంది. చిన్నగా ఉండే ఎలుకలు రెండేళ్లు బతికితే, భారీ తిమింగలాలు 200 ఏండ్లు వరకూ జీవిస్తాయని తెలిసిందే! కానీ, ఒకే జాతికి చెందిన జీవుల విషయంలో ఇందుకు విరుద్ధంగా జరుగుతుందట. ముఖ్యంగా కుక్కల్లో.. చిన్న పరిమాణంలో ఉండేవే ఎక్కువ కాలం జీవిస్తాయట. పెద్ద కుక్కలు త్వరగా వృద్ధాప్యానికి చేరుకుంటాయట. ప్రఖ్యాత ‘సైన్స్’ జర్నల్లో తాజాగా ప్రచురితమైన ఓ అధ్యయనం ఈ విషయాన్ని బయటపెట్టింది. డీఎన్ఏలో మార్పులే ఇందుకు కారణమని తేల్చింది. అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల నేతృత్వంలో ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా ‘డాగ్ ఏజింగ్ ప్రాజెక్ట్’ కింద నమోదైన 864 కుక్కల డేటాను విశ్లేషించారు. జీనోమ్ వ్యాప్తంగా డీఎన్ఏ మిథైలేషన్ తీరుతెన్నులను మ్యాప్ చేశారు.
ఈ సందర్భంగా.. పెద్ద కుక్కల్లో కాలక్రమేణా ‘డీఎన్ఏ మిథైలేషన్’ భారీగా తగ్గిపోవడం వల్ల వృద్ధాప్యం త్వరగా వస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఈ మిథైలేషన్ అనేది డీఎన్ఏ నియంత్రణకు, వృద్ధాప్యానికి ముఖ్యమైన రసాయన సంకేతం. జంపింగ్ జీన్స్, ట్రాన్స్పోజబుల్ ఎలిమెంట్స్ అని పిలిచే జన్యువుల విభాగంలో.. ఈ మార్పు ఎక్కువగా కనిపిస్తుందని వారు అంటున్నారు. అంతేకాకుండా, జీవ సంబంధమైన వృద్ధాప్య తేడాలకు ‘ఎల్ఐఎన్ఈ1ఎస్’ అనే జంపింగ్ జీన్స్ ప్రధాన కారణమని కూడా కనుగొన్నారు. ఇవి ఒక క్రోమోజోమ్ నుంచి మరో క్రోమోజోమ్కి దూకుతూ.. ఆ ప్రక్రియలో డీఎన్ఏను దెబ్బతీస్తాయట. ఫలితంగా జన్యు అస్థిరత, క్యాన్సర్, ఇతర వృద్ధాప్య సంబంధిత వ్యాధులకు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
అందులోనూ, పెద్ద కుక్కలు, మగ వాటిల్లో ఎపిజెనెటిక్ వృద్ధాప్యం వేగంగా జరుగుతున్నట్లు వారు ఈ సందర్భంగా గుర్తించారు. ఇక మనుషులు పెంపుడు జంతువులతో కలిసి జీవిస్తూ వాటికి ఆహారం, వ్యాయామం, జీవితకాల ఆరోగ్య సంరక్షణ అందిస్తున్నందున.. తక్కువ ఆయుర్దాయం ఉన్న ఈ జంతువులపై చేసే పరిశోధనల ఫలితాలను మానవ ఆరోగ్యానికి కూడా అనుసంధానించవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అధ్యయనం కుక్కల్లో వృద్ధాప్య లక్షణాలను గుర్తించడమే కాకుండా.. భవిష్యత్తులో మనుషుల్లోనూ వృద్ధాప్య ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఎంతో దోహదపడుతుందని భావిస్తున్నారు.
వైతాళికుల వాణి
ఆత్మవిమర్శ చేసుకుంటూ తమను తాము సంస్కరించుకునే వాళ్లే ఉత్తములు అనిపించుకుంటారు.
– స్వామి వివేకానంద
క్యా సీన్ హై!

Cartoon
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

